Site icon HashtagU Telugu

Chandrababu: ఆర్టీసీఎండీకి చంద్రబాబు లేఖ.. ఎందుకంటే ?

Chandrababu

Chandrababu

Chandrababu: ఏపీలో ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరుకుంది. మరికొద్దీ గంటల్లో అక్కడ అసెంబ్లీ మరియు లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన ఏకమవ్వగా, అధికార వైసీపీ మాత్రం సింగిల్ గానే బరిలోకి దిగనుంది. దీంతో ఆంధ్రాలో ఎన్నికల ఫీవర్ ఊపందుకుంది. అయితే ఓటర్ల శాతాన్ని పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే అనేక ఏర్పాట్లను చేసింది. తాజాగా చంద్రబాబు ఆర్టీసీఎండీకి చంద్రబాబు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ లో సోమవారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఓటర్లు పోలింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లోని ఓటర్లు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లు బస్సులతో కిటకిట లాడుతున్నాయి. అయితే భారీగా ప్రజలు తమ ఓట్లను వినియోగించుకునేందుకు ఊర్లకు బయలు దేరుతుండటంతో బస్సుల కొరత కనిపిస్తుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ రిజర్వేషన్ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ మేరకు చంద్రబాబు ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకు లేఖ రాశారు.

పోలింగ్‌కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు తన లేఖలో కోరారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచడం వల్ల ఓటర్ల సంఖ్య పెరుగుతుందని చంద్రబాబు సూచించారు. ఓటు వేసేందుకు తెలంగాణ నుంచి ఏపీ ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని, ఈ సమయంలో ఆర్టీసీ ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్, విజయవాడ, బస్టాండ్‌లు రద్దీగా ఉన్నాయని, అవసరమైనన్ని బస్సులను అందుబాటులో ఉంచాలని చంద్రబాబు కోరారు.

Also Read: Kadapa : BJP అంటే బాబు, జగన్, పవన్ – రాహుల్