అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు (Chandrababu).. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆడబిడ్డలఫై అఘాత్యాలకు పాల్పడే కామాంధులకు హెచ్చరిక జారీచేశారు. ఆడబిడ్డల జోలికి వస్తే..నడిరోడ్డుమీద ఉరితీయిస్తా అని పేర్కొన్నారు.
ఏపీలో వరుస అత్యాచారాలు (Rape Incident) ఆగడం లేదు..వరుసగా రాష్ట్రంలో ఎక్కడో చోట అత్యాచారం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. ప్రభుత్వం మారింది..ఆడ బిడ్డలకు రక్షణ ఉంటుందని అంత భావించారు. కానీ ప్రభుత్వం మారిన కామాంధులు మాత్రం మారడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తునప్పటికీ కామాంధులు మాత్రం వారి అరాచకాలను ఆపడం లేదు. కామంతో అభంశుభం తెలియని చిన్నారులను కూడా వదలడం లేదు. యువకులే కాదు 60 , 70 ఏళ్ల వయసు ఉన్న వృద్దులు కూడా అత్యాచారాలకు పాల్పడుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. మరికొంతమంది స్నేహం ముసుగులో అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కామాంధులకు హెచ్చరిక జారీ చేసారు.
శనివారం అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రసంగంలో చిన్న పిల్లలపై జరిగిన అమానవీయ ఘటనలను తీవ్రంగా ఖండించారు. చిన్నారులను కూడా వదలకుండా దాడులు జరుపుతున్న వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇలాంటి అమానవీయ చర్యలను అడ్డుకోవాలంటే నడిరోడ్డుమీదనే ఉరితీయడం అవసరం” అని పేర్కొన్నారు. గంజాయి, మద్యం వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని , ఇప్పటికే హెచ్చరించాం. మరోసారి ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also : Manchu Vishnu Kannappa : కన్నప్ప రిలీజ్.. మంచు హీరో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు..?