Chandrababu: విజయవాడ కనకదుర్గమ్మను తెదేపా అధినేత చంద్రబాబు దర్శించుకున్నారు. సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ అధికారులు, అర్చకులు చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం పండితులు చంద్రబాబు దంపతులకు వేదాశీర్వచనం పలికారు. ఆలయాధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.
కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించమని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరమనే తొలుత దైవదర్శనాలు చేస్తున్నానన్నారు. తెలుగు ప్రజానీకానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు చెప్పారు.
తెలుగు ప్రజలు సిరి సంపదలతో, ఆనందంగా జీవించేందుకు వారికి సేవ చేసే అవకాశం అమ్మవారు ప్రసాదిస్తారని నమ్ముతున్నానన్నారు. మరోవైపు చంద్రబాబు ఆదివారం సింహాచలం అప్పన్న దర్శనానికి వెళతారు. ఇక దాదాపు రెండు నెలల తర్వాత చంద్రబాబు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 10 నుంచి ఆయన పర్యటన చేయనున్నారు.
Also Read: Chandrababu Naidu: జనంలోకి చంద్రబాబు, ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటన!