Site icon HashtagU Telugu

Free Bus Travel: ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష

Free Bus Travel

Free Bus Travel

Free Bus Travel: గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు చంద్రబాబు(Chandrababu). ఆ ఎన్నికల్లో భారీ మెజారితో అధికారం దక్కించుకున్న ఆయన పథకాల అమలుపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డేటా ఆధారిత వివరాలను సేకరిస్తున్నారు. ఓ వైపు అభివృద్ధి పనులను చేపడుతూనే హామీలపై ఆయన ఫోకస్ పెట్టారు.(Free Bus Travel)

వాస్తవానికి అధికారంలోకి వచ్చి రెండు నెలలవుతున్నా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు బస్సు పథకం ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ కార్యక్రమంపై కసరత్తు ప్రారంభించారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపైనే చర్చిస్తారు.

ఉచిత బస్సు సౌకర్యం విజయవంతంగా అమలు చేయబడిన తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలు అవలంబించిన పద్దతులపై అధికారులు చంద్రబాబు వివరించనున్నారు.ఈ పథకం కోసం నెలకు దాదాపు 250 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న పల్లెవెలుగు, అల్ట్రా మరియు ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులతో పాటు, విశాఖపట్నం మరియు విజయవాడ వంటి పట్టణ ప్రాంతాలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని పొడిగించాలని, అలాగే మెట్రో వ్యవస్థను చొరవలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

కాగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తేదీ నుంచి మొదలవుతుందని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆగస్టు 15వ నుంచి ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోనున్నారు. ఇక అదే రోజు అన్నా క్యాంటిన్లను కూడా ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Delhi Coaching Centre Flooding: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాదం కేసులో మరో ఐదుగురు అరెస్ట్