Site icon HashtagU Telugu

AP Politics: చంద్రబాబు నిర్ణయంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన

AP Politics

AP Politics

AP Politics: చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం రాయలసీమ టీడీపీ శ్రేణులకు అయోమయం కలిగిస్తోంది. నారా లోకేష్ కు ఎన్నికల పగ్గాలు అప్పగించడంతో టీడీపీ కార్యకర్తలు ఆలోచనలు పడ్డట్టు కనిపిస్తుంది. యువగళం పాదయాత్ర తర్వాత లోకేష్ గొప్ప నాయకుడిగా ఎదిగాడని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు లోకేశ్ పై పెద్ద బాధ్యతను అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆ ప్రతిపాదన విని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరుతోబాటు.. నెల్లూరు.. ప్రకాశం జిల్లాల ఎన్నికల బాధ్యత లోకేష్ పై పెట్టారు చంద్రబాబు. ఆ ఆరు జిల్లాల్లో 74 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి, ప్రచారం చేసి గెలిపించే బాధ్యత లోకేష్ పై పడింది. అయితే 74 సీట్లు లోకేష్‌కి , చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మిగిలిన సీట్లను అంటే కోస్తా నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించుకోవచ్చు.

కాగా లోకేశ్ కు రాయలసీమ ప్రాంత రాజకీయ, కుల, ఆర్థిక, సామాజిక సమీకరణాల గురించి ఏం తెలుసోనని టీడీపీ శ్రేణులు ఖంగారు పడుతున్నారట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాయలసీమతో పాటు 2019 ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిచిన నెల్లూరు లాంటి ప్రాంతాలను లోకేష్ కు ఇవ్వడం సరికాదని శ్రేణులు గుసగుసలాడుతున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో రాయలసీమలో టీడీపీ కష్టంగానే నెగ్గింది. అంటే అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. అయితే చంద్రబాబు మదిలో ఉన్న ఆలోచన ఇంకా కార్యరూపం దాల్చలేదు కానీ… నిజంగా చంద్రబాబు అలా చేస్తారా? ఆ ఆరు జిల్లాల బాధ్యతను లోకేష్ కు అప్పగించే సాహసం చేస్తారా? అసలు తన కొడుకు మీద అతనికి అంత నమ్మకం ఉందా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలం.. తొలి సెట్ లో అమ్ముడుపోని ఆటగాళ్లు వీళ్ళే..!