Site icon HashtagU Telugu

CM Chandrababu : ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు చంద్రబాబు ఆదేశం

CM Chandrababu busy tour... Rapid progress towards development in three districts

CM Chandrababu busy tour... Rapid progress towards development in three districts

CM Chandrababu : ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా “సుపరిపాలనలో తొలిఅడుగు” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పరిశీలకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు బలంగా వివరించాలని, అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

Anchor Swetcha Votarkar : తన రెండు కళ్లను దానం చేసిన యాంకర్ స్వేచ్ఛ

గతంలో ప్రజలతో సరైన సంబంధం లేకపోవడం వల్లనే టీడీపీపై దుష్ప్రచారం చోటుచేసుకుందని గుర్తు చేస్తూ, “2014లో మంచి పాలన ఇచ్చినా, ప్రచారం లోపించడంతో ప్రజల నమ్మకాన్ని కోల్పోయాం. ఈసారి అలాంటి పరిస్థితి రానీయకూడదు” అని హెచ్చరించారు. “వివేకానందరెడ్డి హత్య, కోడికత్తి డ్రామాలు – ఇవన్నీ కుట్రలే. ఇలాంటి వాటిపై ప్రజలకు నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత మనదే” అన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. “పనిచేయడమే కాదు, చేయలేని పనులకు కారణాలు చెప్పగలగాలి. ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేయడం అవసరం. ప్రజల నమ్మకమే మన విజయానికి మూలం” అని సూచించారు.

తన ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి పనితీరు సమీక్షిస్తానని తెలిపారు. మార్పు అవసరమైతే తగిన సూచనలు, అవసరమైతే కఠిన చర్యలకైనా వెనుకాడబోనని తెలిపారు. “వారసత్వం ఉన్నంత మాత్రాన గుర్తింపు లభించదు. పనిచేసే వారికి మాత్రమే గౌరవం” అన్నారు. విభజన తర్వాత గడిచిన అనుభవాలు విశ్లేషిస్తూ, అభివృద్ధి కొనసాగాలంటే సుస్థిర ప్రభుత్వం అవసరమని వివరించారు. “ఒకే ఏడాదిలో రూ.9,340 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. దీని ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి. పోలవరం, అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలోకి తీసుకెళ్తున్నాం” అని తెలిపారు.

Cancer Symptoms: గ్యాస్, మలబద్ధకంతో ఇబ్బంది ప‌డుతున్నారా? ఇవి క్యాన్సర్‌కు సంకేత‌మా?