Site icon HashtagU Telugu

Chandrababu Naidu: మైనార్టీల వైపు చంద్రబాబు!

Chandrababu

Chandrababu

Chandrababu Naidu: తెలుగుదేశంపై అపవాదులు వేయడంలో వైసీపీ 2019 ఎన్నికల్లో పైచేయి సాధించింది. చేయని తప్పులను కూడా అపాదించింది. అలాంటి వాటిలో ఒకటి ముస్లిం రిజర్వేషన్లు. వాస్తవంగా మైనారిటీలకు వైఎస్ ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది. వాటిపై టీడీపీనే హైకోర్టులో వ్యాజ్యం వేసి, దీనిని కొట్టేసేలా చేసిందనే ధుష్ప్రచారాన్ని వైసీపీ టీడీపీపై బాగా రుద్దింది. నిజానికి ఆ వ్యాజ్యం వేసింది టీడీపీ కాదు అయినా ఆరోపణలపై కౌంటర్ ఇవ్వకపోవడంతో ఆ వర్గంలో ఇది మైనస్ అయ్యింది.

అందుకే అప్పటి నుంచి ఆ ఓటు బ్యాంకు పూర్తిగా వైఎస్ వైపు మళ్లింది. అయితే చంద్రబాబు హయాంలో కొన్ని పథకాలను ప్రవేశ పెట్టారు. దుల్హన్ ,హజ్ యాత్రకు నిధులు వంటివి ఇచ్చారు. అయితే అవి సరైన ప్రచారం లేక టీడీపీ కి మైలేజీ తెచ్చిపెట్టలేక పోయాయి.బలమైన నియోజకవర్గాల్లో మైనారిటీ ఓటు బ్యాంకును కైవసం చేసుకునే వ్యూహాత్మక నాయకులకు చోటు ఇవ్వకపోవడం మైనస్గా మారిపోయింది. ముందుగా మైనారిటీల ఓట్లను ఎలా తమవైపు తిప్పుకోవాలనే విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టి ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు.

చంద్రబాబు తాజాగా మైనారిటీలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం అయితే చేశారు. కానీ చంద్రబాబు హవా జోరుగా ఉన్న 2014 ఎన్నికల్లోనే ఆ పార్టీకి ఒక్క మైనారిటీ సీటు కూడా దక్కలేదు. అప్పట్లోనే మైనారిటీ శాఖను ఏర్పాటు చేయలేక పోయారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి జలీల్ ఖాన్ను తీసుకుని మైనారిటీ శాఖను అప్పగించాలని చూసినా కలిసి రాలేదు. ఇక ఇప్పుడు ఈ మూడున్నరేళ్ల కాలంలో పార్టీ పరంగా చూసుకున్నా మైనారిటీలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. పార్టీప రంగా వారికి ప్రాధాన్యం కల్పించి ఉన్నా మైనారిటీలో విశ్వాసం పెరిగి ఉండేది. అయితే మైనారిటీలకు తాము 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మైనార్టీలు టీడీపీ వైపు చూసేలా బాబు ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ వేసిన అపవాదులు మైనారిటీలో ఉండిపోయాయి. వాటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు.