Site icon HashtagU Telugu

Chandrababu : రాజ‌మండ్రి జైల్లో చంద్రబాబుకు అలర్జీ.. సెంట్ర‌ల్ జైలుకు చేరుకున్న వైద్యులు

Chandrababu

Chandrababu

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాజ‌మండ్రి జైల్లో అస్వ‌స్థ‌త‌కు గురైయ్యారు. గ‌త వారం రోజుల నుంచి ఎండ తీవ్ర‌త ఎక్కువ ఉండ‌టంతో చంద్ర‌బాబు డీహైడ్రేష‌న్‌కు గురైయ్యారు. ఉక్కపోత‌తో ఆయ‌న‌కు అల‌ర్జీ వ‌చ్చింది. దీంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. జైలులోకి వెళ్లి చంద్రబాబుకు వైద్య ప‌రీక్ష‌లు చేస్తున్నారు. సోమ‌వారం చంద్ర‌బాబుతో ములాఖ‌త్ అయిన నారా భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణిల‌కు చంద్ర‌బాబు ఈ విష‌యాన్ని తెలిపారు. అయితే అదే విష‌యాన్ని సీఐడీ విచార‌ణ అనంత‌రం లోకేష్‌కు భువ‌నేశ్వ‌రి తెలిపారు.జైలు అధికారుల‌కు ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల వ‌ర‌కు ప‌ట్టించుకోలేద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆయ‌న‌కు అల‌ర్జీ రావ‌డంతో జైలు అధికారులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు. హుటాహుటినా జైలు అధికారులు వైద్యుల‌కు స‌మాచారం ఇచ్చి ప‌రీక్ష‌లు చేపిస్తున్నారు. చంద్ర‌బాబు భ‌ద్ర‌త, ఆరోగ్యంపై మొద‌టి నుంచి టీడీపీ నేత‌లు ఆందోళ‌న‌లు చేస్తున్నారు. జైల్లో చంద్ర‌బాబుకు ప్రాణ‌హాని ఉంద‌ని, ఆయ‌న‌కు సౌక‌ర్యాలు కూడా క‌ల్పించ‌డంలేద‌ని టీడీపీ ఆరోపించింది. దాదాపు నెల రోజులకు పైగా చంద్ర‌బాబు జైల్లోనే ఉన్నారు. ఏసీ సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో ఎండ తీవ్ర‌త‌కు చంద్ర‌బాబు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

Also Read:  TDP : దొంగ ఓట్లపై ఎన్నికల కమిషనర్ కు టీడీపీ ఫిర్యాదు