Site icon HashtagU Telugu

‘Jana Nayakudu’ : ‘జన నాయకుడు’ కేంద్రాన్ని ప్రారంభించిన చంద్రబాబు

Jananayakudu Center

Jananayakudu Center

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కుప్పంలో టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ (Jana Nayakudu Center) అనే ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రజల సమస్యల పరిష్కారానికి సులభతరమైన మార్గాన్ని అందించేందుకు ఏర్పాటు చేశారు. ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సమర్పించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడనుంది.

Karimnagar : మళ్లీ గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత

ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల కోసం టీడీపీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ‘జన నాయకుడు’ కేంద్రం ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్లైన్‌లో నమోదు చేసి, పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో వేగం పెంచడమే తమ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు.

ఈ కేంద్రం ప్రారంభోత్సవానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా హాజరయ్యారు. సమస్యలను ఆన్లైన్ విధానంలో నమోదు చేయడం వల్ల వాటి పరిష్కారంలో పారదర్శకత పెరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అంతేకాక, ప్రజలతో నేరుగా కలిసిపోయి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాలనకు ప్రజలతో నేరుగా సంబంధం ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కుప్పంలో మొదలైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని టీడీపీ యోచిస్తోంది.