అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇరువురు కలిసి తాడేపల్లి గూడెం లో ‘జెండా’ సభను బుధువారం నిర్వహించారు. ఈ సభకు రెండు పార్టీల దాదాపు 5 లక్షల మంది కార్యకర్తలు , అభిమానులు హాజరయ్యారు.
ఈ సభలో చంద్రబాబు సినిమా డైలాగ్స్ పేలుస్తూ..రెండు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన భారీ సభ చూసి తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతోందని చంద్రబాబు అన్నారు. ‘త్వరలో రాష్ట్రానికి నవోదయం. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన – టీడీపీ పార్టీలు కలిశాయని..ఇది జనం కోరుకున్న పొత్తు అని తెలిపారు. నాడు విభజనతో రాష్ట్రం నష్టపోయింది. ఈనాడు జగన్ పాలన తో రాష్ట్రం అప్పుల్లో కురుకపోయిందన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణం చేపట్టాం. కష్టపడి పెట్టుబడులు తెచ్చి ఏపీ అభివృద్ధి చేసుకుంటుంటే వైసీపీ ప్రభుత్వం వచ్చి అంతా నాశనం చేసింది’ అని నిప్పులు చెరిగారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉండవల్లి ప్రజావేదికను కూల్చి జగన్ తన పరిపాలన ప్రారంభించారని ..ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారు. కానీ ఈ సైకో జగన్ విధ్వంసంతో ప్రారంభించారని బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. మంచి రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం. పోలవరం ద్వారా ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే సంకల్పంతో ముందుకెళ్లాం. కానీ జగన్ ఐదేళ్లు ఏం చేశారు? కులాలు, ప్రాంతాలు, వర్గాలుగా విభజించి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు’ అని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు బాబు. మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం. రాష్ట్రాన్ని బాగుచేయాలన్న సంకల్పంతో మేం ముందుకెళ్తున్నాం’ అని స్పష్టం చేశారు.
మీము అభ్యర్థులను ప్రకటించగానే జగన్ లో వణుకు మొదలైందని, అందుకే మళ్లీ అభ్యర్థులను మారుస్తాం అంటూ చెప్పుకొస్తున్నారని బాబు పేర్కొన్నారు. వైసీపీ గుండాలకు టికెట్ ఇస్తే..మీము ఉన్నత చదువులు చదువుకున్న వారికీ ఇస్తున్నాం అన్నారు. అలాంటి గుండాలకు ఇక అసలు సినిమా చూపిస్తాం అన్నారు. ఈ 40 రోజులే ఆ గుండాల ఆటలు..40 రోజుల ఆతర్వాత అసలు సినిమా మీము చూపిస్తాం అన్నారు.
Read Also : Vinod: గురువు కోసమే బ్యారేజీ కొట్టుకుపోయేలా రేవంత్ కుట్రలు: వినోద్