మరికాసేపట్లో ఏపీకి 4 వ సారి సీఎం గా చంద్రబాబు (Chandrababu) ప్రమా స్వీకారం చేయబోతున్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఉదయం 11:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు తెలుగు తమ్ముళ్లు ఉదయం 6 గంటలకే అక్కడికి చేరుకోవడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తరలిరావడంతో రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. పలుచోట్ల భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
ఇక కూటమి విజయం సాధించిన తరుణంలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయో అని అంత మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో సోమవారం రాత్రి మంత్రుల జాబితాను ప్రకటించారు. మొత్తం 133 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి 21 మంత్రి పదవులు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు 3 మంత్రి పదవులు(పవన్ డిప్యూటీ సీఎం), 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి 1 మంత్రి పదవి అప్పగించారు. అయితే మంత్రి పదవులు ఆశించిన పలువురు సీనియర్ నేతలకు నిరాశ ఎదురైంది. వారిలో బుచ్చయ్య చౌదరి, అయ్యన్న, ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాసరావు, యరపతినేని, బొండా ఉమ, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, GV ఆంజనేయులు తదితరులు ఉన్నారు. అలాగే JC అస్మిత్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావుకూ అవకాశం దక్కలేదు.
ఒకసారి మంత్రి పదవులు దక్కించుకున్న వారి లిస్ట్ చూస్తే..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌తో పాటు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించింది.
Read Also : Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న ప్రముఖులు వీరే..!