TDP Manifesto: చంద్రబాబు ఎన్నికల శంఖారావం! తొలి మేనిఫెస్టో ఇదే

తొలివిడత మేనిఫెస్టో తో మహానాడు ముగిసింది. మహిళలు, బీసీలు, యువకులు, రైతులకు వరాలు కురిపించేలా మేనిఫెస్టో ను చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల శంఖారావం పురించారు.

TDP Manifesto: తొలివిడత మేనిఫెస్టో తో మహానాడు ముగిసింది. మహిళలు, బీసీలు, యువకులు, రైతులకు వరాలు కురిపించేలా మేనిఫెస్టో ను చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల శంఖారావం పురించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాల పై భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో పలు పథకాల పై మహానాడు లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడం క్యాడర్ లో జోష్ నింపింది.
చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఇలా
1. మహాశక్తి పథకం కింద…

1) ఆడబిడ్డ నిధి:-18 ఏళ్లు నిండిన మహిళలు – నెలకు రూ.1500
-ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు
2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు
3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం
2. యువగళం:-యువగళం విన్నాం – 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
– యువగళం నిధి కింద నెలకు రూ.3000

3.అన్నదాత-అన్నదాతకు ఏడాదికి రూ. 20 వేలు.

4. రాష్ట్రం లో ఇంటింటికి మంచినీరు

5. బిసిలకు రక్షణ చట్టం

6. పూర్ టు రిచ్:-
పేదలను సంపన్నులు చేస్తాం- ఆదాయం రెట్టింపు చేస్తాం.

Read More: Chandrababu Naidu : చంద్ర‌బాబు ఏ క్ష‌ణ‌మైన జైలుకెళ్ల‌డం ఖాయం.. వైసీపీ మంత్రి సంచలన కామెంట్స్..