Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ(Vijayawada)లో డయేరియా(diarrhea) మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు. డయేరియాతో వారం రోజుల వ్యవధిలోనే 9 మంది చనిపోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు.
We’re now on WhatsApp. Click to Join.
కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటి గురించి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా టీడీపీ అధినేత ప్రభుత్వాన్ని కోరారు.
Read Also: Driving License : నేటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్
కాగా, విజయవాడలో డయేరియా లక్షణాలతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. డయేరియా లక్షణాలతో ఇప్పటివరకు 9 మంది మరణించారు. సుమారు 150మంది వరకు డయేరియా సమస్యతో బాధపడుతున్నారు. అయితే ప్రాథమికంగా ఈ ప్రాంతాల్లో డయేరియాకి కలుషిత నీరే కారణమని చెబుతున్నారు.