Chandrababu Quash Petition : చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా

చంద్రబాబు తరఫున హరీష్‌ సాల్వే తన వాదనాలు వినిపించారు. 17ఏ సెక్షన్ వర్తించదని హైకోర్టు పేర్కొన్న విషయాన్న ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు హరీష్‌ సాల్వే. వాదనలు మొత్తం 17ఏ చుట్టే తిరిగాయి

  • Written By:
  • Publish Date - October 3, 2023 / 01:45 PM IST

యావత్ తెలుగు ప్రజానీకం ఉత్కంఠ గా ఎదురుచూస్తున్న చంద్రబాబు క్వాష్ పిటిషన్ (Chandrababu Quash Petition) విచారణ మరోసారి సుప్రీం కోర్ట్ (సుప్రీం Court) వాయిదా వేసింది. ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మాజీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా పేర్కొని అరెస్టు చేశారు. అయితే, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ను గత నెల మూడో వారంలో దాఖలు చేశారు. ఈరోజు (అక్టోబరు 3) సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది.

చంద్రబాబు తరఫున హరీష్‌ సాల్వే తన వాదనాలు వినిపించారు. 17ఏ సెక్షన్ వర్తించదని హైకోర్టు పేర్కొన్న విషయాన్న ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు హరీష్‌ సాల్వే. వాదనలు మొత్తం 17ఏ చుట్టే తిరిగాయి. 17ఏ వర్తించదని హైకోర్టు చెప్పడం సరికాదన్న విషయంపై వాదనలు వినిపించారు హరీష్‌ సాల్వే. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. నేరం ఎప్పుడు జరిగిందన్నది ముఖ్యం కాదు FIR ఎప్పుడు నమోదు చేశారన్నదే ముఖ్యమని హరీష్ సాల్వే తన వాదనల్లో పేర్కొన్నారు. 2018 తర్వాత నమోదయ్యే FIRలు అన్నింటికీ 17A వర్తిస్తుందని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కేబినెట్ నిర్ణయం మేరకే స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటైందని న్యాయస్థానానికి వివరించారు. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ఒప్పందాలు కూడా కేబినెట్ నిర్ణయాలు మేరకే జరిగాయన్నారు. ప్రభుత్వ రాజకీయ కక్షతోనే కేసులను నమోదు చేస్తుందని హరీష్ సాల్వే వాదించారు. అయితే.. వాదనల తర్వాత ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. హైకోర్టులో దాఖలు చేసిన అన్ని పత్రాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈరోజు చంద్రబాబు కేసు ఫై ఏదోఒకటి తేలిపోతుందని భావించినప్పటికీ సుప్రీం కోర్ట్ వాయిదా వేసి మరోసారి ఉత్కంఠ అలాగే కొనసాగేలా చేసింది.

Read Also : Crime News: యూకే లో హైదరాబాద్ వ్యక్తి దారుణ హత్య