బాబు(Chandrababu) దావోస్ (Davos) కు వెళ్లి ఒక్క ప్రాజెక్ట్ తీసుకురాలేదు, ప్రజల దానం వృధా చేసారు, పబ్లిసిటీ కాదు ప్రాజెక్ట్ లు తీసుకురావాలి, మీము దావోస్ కు వెళ్లి ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం..ఇలా ఎన్నో విమర్శలు చేస్తున్న వైసీపీ (YCP) కి బాబు ఒక్క ప్రజెంటేషన్ (Chandrababu Presentation) తో అన్ని మూసుకునేలా చేసాడు. నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక నేపథ్యంలో ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్‌లో రాష్ట్రం కోసం కేవలం 7 నెలల వ్యవధిలోనే రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడం గొప్ప విషయమని తెలిపారు. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు యువతకు 4,10,125 ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని అన్నారు.
Telugu States Leaders : ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు నేతల ప్రచార హోరు.. రేవంత్, పవన్ సైతం
ఈ పెట్టుబడుల్లో విశాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడి రాబడుతోంది. ఆర్సెలర్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్లు, ఎన్‌హెచ్‌పీసీ రూ.1 లక్ష కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. మొత్తం 20 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం, ఇందులో 3 కంపెనీలు లక్ష కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని చంద్రబాబు తెలిపారు.
ఈ పెట్టుబడులతో రాష్ట్ర యువతకు 4 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు హామీ ఇచ్చారు. 7 నెలల వ్యవధిలోనే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంలో ఐదోవంతు సాధించగలగడం తమ కూటమి ప్రభుత్వం దక్షతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు పూర్తిగా గ్రౌండ్ అయ్యే సరికి రాష్ట్రంలో అభివృద్ధి గిరాకీ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక వైసీపీ విమర్శలకు బదులిస్తూ చంద్రబాబు.. గత ఐదేళ్ల వైసీపీ పాలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని, పెట్టుబడిదారులు ముందుకు రాకుండా చేసింది అని ఆరోపించారు. అయినా, తమ కూటమి ప్రభుత్వం అందించిన విశ్వాసం, ప్రతిభ కారణంగానే ఈ స్థాయి పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. విపక్షాలు రాద్ధాంతం చేయడం మానుకొని నిజాలను అంగీకరించాలని సూచించారు.
చంద్రబాబు ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెంచే ప్రయత్నం చేశారు. వాస్తవ గణాంకాలతో, అభివృద్ధి పట్ల చూపిన దృఢత్వంతోనే పెట్టుబడులు వస్తాయని ఆయన స్పష్టంచేశారు. ఈ పెట్టుబడులు రాష్ట్ర భవిష్యత్తును మెరుగుపరచడంతో పాటు యువతకు ఆశాజనకంగా మారతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.