Chandrababu: సీమ సాగునీటి ప్రాజెక్టులపై CBN ప్రజెంటేషన్

ముఖ్యమంత్రి జగన్ రాయలసీమను రాళ్ళ సీమగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రేణిగుంట పర్యటనలో భాగంగా చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

Chandrababu: ముఖ్యమంత్రి జగన్ రాయలసీమను రాళ్ళ సీమగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రేణిగుంట పర్యటనలో భాగంగా చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అదేక్రమంలో ఏపీ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి అపహాస్యం కావద్దని సూచించారు.

ఏళ్లుగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు దశ దిశ మార్చేశారని తెలిపారు. అయితే సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో రాయలసీమ నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. గతంలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి చేస్తే, నాపై రణభేరి చేసి నా రక్తాన్ని ప్రాజెక్టుల్లో పారించే పరిస్థితికి తీసుకొచ్చిందని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్లు పారించాలని టీడీపీ చూస్తుంటే.. రక్తం పారించాలని వైసీపీ భావిస్తుందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా రేణిగుంటలో పర్యటించిన ఆయన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ కార్యక్రమంలో ప్రజెంటేషన్ ఇచ్చారు.

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 1,147 ఎకరాల్లో చెరువుల ఆక్రమణ జరిగిందని ఆరోపించారు చంద్రబాబు. గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అవినీతికి పాల్పడట్లు తెలిపారు జగన్ ప్రభుత్వంలో అత్యధికంగా దోపిడీకి పాల్పడింది మంత్రి పెద్దారెడ్డి అని సంచలన ఆరోపణలు గుప్పించారు చంద్రబాబు నాయుడు.

Also Read: Vizag Airport Suspended : విశాఖ విమానాశ్ర‌యం మూసివేత‌పై పురంధ‌రేశ్వ‌రి ఫైట్