Site icon HashtagU Telugu

Chandrababu : జగన్ కు ఫోన్ చేసిన చంద్రబాబు

Babu Phone To Jagan

Babu Phone To Jagan

ఏపీ నూతన సీఎం గా రేపు (జూన్ 12) చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ తో పాటు NDA నేతలు , సినీ ప్రముఖులు ఇలా పెద్ద ఎత్తున హాజరుకాబోతున్నారు. అలాగే విదేశీ ప్రతినిధులు సైతం రాబోతున్నట్లు తెలుస్తుంది. అమరావతి అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు పలు విదేశీ సంస్థల ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొరియా కాన్సులేట్‌ జనరల్‌, (Korea Consulate General) జపాన్, సింగపూర్, దక్షిణకొరియా, నెదర్లాండ్స్‌ కాన్సులేట్ జనరల్స్‌కు ఆహ్వానం పంపించారు. ఆయా రాయబార కార్యాలయ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఆహ్వానం పంపించారు. ఏపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇప్పటికే ఆయా దేశాల ప్రతినిధులు గన్నవరం చేరుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి సైతం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసారు. అయితే, జగన్ ఫోన్ కాల్​కు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. అయితే, ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించినట్లు సమాచారం. అందువల్లనే జగన్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి సమీప కేసరపల్లిలో ఎన్‌హెచ్‌-16 పక్కనే ఐటీ పార్కు ప్రాంగణం వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాటు చేసారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా పూర్తిగా పైకప్పు వేశారు. వీఐపీలకు నాలుగు గ్యాలరీలు కేటాయించగా, మిగిలిన ప్రాంగణంలో సాధారణ ప్రజలు కూర్చునేందుకు సీటింగ్‌ సౌకర్యం కల్పించారు. సభా ప్రాంగణంతో పాటు రహదారుల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అమర్చారు.

Read Also : Ramoji Rao : రామోజీ రావు కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి