Raj Bhavan: ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో నిర్వహించే గవర్నర్ ఎట్ హోం కార్యక్రమం విజయవాడ (Vijayawada)లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తో పాటు రాజకీయ నేతలంతా హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు కూడా హాజరైన ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం దూరంగా ఉండిపోయారు. రాజ్ భవన్ లో ఈ సాయంత్రం జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి హాజరయ్యారు. గవర్నర్, ఛీఫ్ జస్టిస్, సీఎస్ దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన్ను కలిసేందుకు, ఫొటోలు దిగేందుకు నేతలు, అధికారులు పోటీ పడ్డారు. అలాగే వీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల కనిపించగానే లోకేష్ ఆమెను పలకరించారు. దీంతో ఆమె కూడా కాసేపు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తన సతీమణి విదేశాల్లో ఉండటంతో ఒంటరిగానే వచ్చారు. గతంలో సీఎంగా ఉండగా ప్రతీ ఏటా గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాలకు హాజరైన వైఎస్ జగన్ .. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎట్ హోం కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేదు. తన సోదరి వైఎస్ షర్మిల కూడా హాజరై సీఎం, మంత్రులతో కలివిడిగా కనిపించిన ఈ కార్యక్రమంలో జగన్ లేకపోవడంతో అంతా చర్చించుకున్నారు. అటు జగన్ గైర్హాజరుపై వైసీపీ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు.
ఆగస్టు 15 సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ ఇచ్చే సంప్రదాయవిందు ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ మినహా మిగిలిన ముఖ్యనేతలంతా హాజరయ్యారు. పిసిసి ఛీఫ్ షర్మిల ఈ కార్యక్రమానికి రావటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే షర్మిల , మంత్రి లోకేష్ లు ఇద్దరూ కాసేపు ముచ్చటించుకోవటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే కూటమికి కాంగ్రెస్ పార్టీ తోకపార్టీలా తయారైందని వైసీపీ నేతలు విమర్శలు సంధిస్తోన్న తరుణంలో ఈ ఇద్దరు నేతలు దాదాపు 3 నిమిషాల పాటు చర్చించుకోవటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
Read Also: Hero Vida V1 Plus : రూ. 18లో 100కి.మీలు పరిగెత్తుతుంది, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కూడా తక్కువే..!