Chandrababu Take Oath : కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఈ నెల 12న ఉ.11.27 గంటలకు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు సమాచారం

  • Written By:
  • Publish Date - June 7, 2024 / 09:34 PM IST

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి..ఇక ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ తరుణంలో చంద్రబాబు 4 వ సారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కూటమి విజయం సాధించిన తర్వాత నుండి చంద్రబాబు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారో అంటూ అంత మాట్లాడుకుంటున్నారు. ఇదే క్రమంలో పలు ప్రాంతాల పేర్లు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉ.11.27 గంటలకు ప్రమాణం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు సమాచారం. వేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామగ్రిని తీసుకొచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే టీడీ జనార్దన్‌, టీడీపీ నేతలు సభా స్థలాన్ని పరిశీలించారు. ఇక ఈ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ తో పాటు పలు రాష్ట్రాల సీఎంలు హాజరుకాబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ముందుగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎయిమ్స్‌ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. అయితే ప్రధాని మోడీ తో పాటు ఎన్డీయే కూటమి ముఖ్యనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉండడం, టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో అధికారులు, టీడీపీ నేతలు ఆ ప్రాంతం అనువుగా ఉండదని భావించి కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఎంపిక చేసారు. ఇక వైసీపీ అధినేత జగన్ ను సైతం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమానికి జగన్ హాజరవుతారా లేదా అని చూడాలి.

Read Also : Payal Rajput: ర‌క్ష‌ణ మూవీ రివ్యూ