Site icon HashtagU Telugu

Chandrababu ISB : `ఐఎస్ బీ` చ‌రిత్ర‌లో చంద్ర‌బాబు

CBN ISB

Chandrababu Isb

హైద‌రాబాద్‌కు ఐఎస్బీ ఎలా వ‌చ్చింది? 20ఏళ్ల క్రితం ప్రారంభించిన ఆ సంస్థ స్నాత‌కోత్స‌వాల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్న త‌రుణం ఇది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌స్తున్న క్ర‌మంలో ఒక‌సారి ఐఎస్బీ పుట్టుపూర్వోత్త‌రాల‌ను అవ‌లోక‌నం చేసుకుంటే చంద్ర‌బాబు విలువ తెలుగు ప్ర‌జ‌ల‌కు తెలుస్తుంది. ఐఎస్ బీని ఏర్పాటు చేసి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ కు ఎలా వచ్చిందన్న విషయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

దేశంలోని టాప్ పారిశ్రామికవేత్తలంతా కలిసి అత్యుత్తమ బిజినెస్ స్కూల్ పెట్టాలని నెల‌కొల్పాల‌ని యోచించారు. మానవ వనరుల ఉత్పత్తి కేంద్రంగా ఉండ‌డంతో పాటు దేశానికి త‌ల‌మానికంగా ఉండాల‌ని త‌ల‌పోశారు. అందులో భాగంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను(ఐఎస్ బీ) ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. ఆ రోజుల్లో వారు బెంగళూరులో ఐఎస్బీని ప్రారంభించాల‌ని తొలుత‌ భావించారు. అందుకోసం ఏర్పాట్లు పూర్తి చేయటమే కాదు, ఆనాడున్న కర్ణాటక ముఖ్యమంత్రి పాటిల్ ను కలిసి నిర్ణయాన్ని తెలియ‌చేయాల‌ని టాప్ ఇండిస్ట్రియ‌లిస్ట్ లు నిర్ణయించారు. అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారు.

ఆ విషయం తెలుసుకున్న ఆనాటి ఉమ్మ‌డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక దిగ్గజాలను హైదరాబాద్ కు బ్రేక్ ఫాస్ట్ కు రావాలని రిక్వెస్ట్ చేశారు. “మీరు కోరుకున్నట్లుగా బెంగళూరులోనే ఐఎస్ బీని పెట్టండి. కానీ అక్క‌డ‌కి వెళ్లేటప్పుడు హైదరాబాద్ కు వచ్చి బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్లాలని కోరారు. అందుకు పారిశ్రామికవేత్త పెద్ద ఆసక్తి చూపించలేదు. ఆ టైంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల డైరెక్టర్ లో ఒకరైన శీనిరాజును సంప్రదించిన చంద్రబాబు , పారిశ్రామికవేత్తల్ని హైదరాబాద్ కు వచ్చేలా చూడాలని కోరారు.

అప్పట్లో హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబు ఇమేజ్ ప్ర‌పంచానికి తెలుసు. అదే పనిగా బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని అభ్య‌ర్థిస్తోన్న తీరును కాదనలేక వస్తామని పారిశ్రామిక‌వేత్త‌లు హామీ ఇచ్చారు. ఆ మేర‌కు అందరూ హైదరాబాద్ కు బ్రేక్ ఫాస్ట్ కు వచ్చారు. వారందరికి చంద్ర‌బాబు కొసరికొసరి వడ్డించి. వారు స్టార్ట్ చేయబోయే విద్యా సంస్థ గురించి వివరాలు అడిగారే త‌ప్ప హైద‌రాబాద్‌ లో పెట్టాలని వారిని ఇబ్బందికి గురి చేయలేదు. బ్రేక్ ఫాస్ట్ ముగిసిన తర్వాత వారంతా ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు తమ కార్ల వద్దకు వెళ్లగా, చంద్రబాబు స్వయంగా ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త కారు వద్దకు వెళ్లి వ్యక్తిగతంగా వారికి వీడ్కోలు పలికారు.

సీన్ కట్ చేస్తే, హైదరాబాద్ నుంచి స‌దరు పారిశ్రామికవేత్తలు బెంగుళూరు వెళ్లారు. ఆ రాష్ట్ర సీఎం ఇచ్చిన టైంకు ఆయ‌న ఛాంబ‌ర్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. కానీ, వేరు పనుల్లో బిజీగా ఉన్న క‌ర్ణాట‌క సీఎం దాదాపు దాదాపు మూడు గంటల పాటు పారిశ్రామిక‌వేత్త‌ల‌ను వెయిట్ చేయించారు. దీంతో, వారంతా ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకొని , శీనిరాజుకు ఫోన్ చేశారు. `బెంగళూరులో పెట్టాలనుకున్న బిజినెస్ స్కూల్ ను హైదరాబాద్ లో పెట్టాలనుకుంటున్నాం అంటూ స‌మాచారం ఇచ్చారు. మా నిర్ణయాన్ని సీఎం చంద్రబాబుకు తెలియజేయండన్నారు.` రాలేమని చెప్పిన బ్రేక్ ఫాస్ట్ కు రప్పించి , వారికి అతిధి మర్యాదలు చేయటం ద్వారా మనసు దోచుకున్న చంద్రబాబు హైదరాబాద్ మణిహారంలో ఒక మణి లాంటి ఐఎస్ బీని తీసుకొచ్చారు. ఇదంతా ఆనాటి ప్ర‌తిప‌క్షాల‌కు కూడా తెలుసు. ఆనాడు ఉమ్మ‌డి సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ఐఎస్ బీ కోసం చేసిన ప్ర‌య‌త్నం ఎవ‌రూ కాద‌న‌లేరు. ప‌చ్చి వాస్త‌వ‌మ‌ని ఏ పారిశ్రామిక‌వేత్త‌ను అడిగినా చెబుతారు. విజన్ ఉన్న నేత ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటే ఏం జరుగుతుందన్న విషయం ఐఎస్ బీ చరిత్రలోకి వెళితే తెలుస్తోంది. త‌రాలు మారినా మ‌రువ‌లేని ఐఎస్ బీ చ‌రిత్ర‌లో చంద్ర‌బాబు పాత్ర న‌భూతోన‌భ‌వ్యిష‌త్‌.!