Site icon HashtagU Telugu

CBN : శ్రీపెంరబదూర్ శ్రీరామానుజ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు

CBN

CBN

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శ్రీపెరంబదూర్లోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టం అని చంద్రబాబు అన్నారు. అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించినట్లు తెలిపారు. తమిళనాడులో తనకు లభించిన ఘన స్వాగతంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. తాను కష్టంలో ఉన్న సమయంలో ప్రజలు ఇచ్చిన మద్దతు మరిచిపోలేన‌న్నారు. ధర్మాన్ని రక్షించుకునేందుకు.. తెలుగు జాతి కోసం ముందుండి పనిచేస్తానని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలు మార్పు తేవాలనే విషయంలో స్పష్టతతో ఉన్నారని.. 5ఏళ్ల పాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అందరి సహకారంలో రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చంద్రబాబు అన్నారు. చెన్నై విమానాశ్రయం వద్ద స్థానిక ప్రజలు, అభిమానులు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

Also Read:  5 School Holidays : నెలాఖరులో 5 వరుస సెలవులు.. వచ్చే నెలలో 6 వరుస సెలవులు