సీఎం చంద్రబాబు (Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం పోలవరం (Polavaram ) పనులు పరిశీలించడానికి వెళ్తున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని ఆయన నిర్ణయించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన ఈ రోజు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ నిర్వహిచారు.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్రంలోని ప్రాజెక్టుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. పోలవరం సందర్శన అనంతరం కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాతే అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్ ఉందని సమాచారం. పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటూ ఈ సందర్భంగా అధికారులను ఆయన ప్రశ్నించారు. దీంతో వారిచ్చిన సమాధానానికి ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట నిర్మాణంపై సమీక్ష నిర్వహించేవారు. అందులోభాగంగా ఆయన పోలవరం ప్రాజెక్ట్ సైతం దర్శించేవారు. ఇక ఇప్పుడు మరోసారి అలాగే చేయబోతున్నారు.
Read Also : RK Roja : మంచి చేసి ఓడిపోయారట..మాజీ మంత్రి రోజా ట్వీట్