CBN : తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా – సీఎం చంద్రబాబు

తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తా

  • Written By:
  • Publish Date - June 13, 2024 / 01:19 PM IST

తిరుమల (Tirumala) నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా.. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తా.. అని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు (AP CM Chandrababu). బుధువారం ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు..నిన్న సాయంత్రం తిరుమలకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసిన ఆయన…ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకి ఇస్తికఫాల్ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు.

అనంతరం ఆయన అక్కడే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. తమది దేశ చరిత్రలోనే చరిత్రత్మక విజయమని.. 93 శాతం స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చామని.. ఈ క్రమంలోనే శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నానని బాబు తెలిపారు. అలాగే గతంలో అలిపిరిలో తనపై జరిగిన దాడిలో నన్ను వెంకటేశ్వర స్వామి బతికించారని గుర్తు చేసుకున్నారు. ఏ పని చేసినా వెంకన్న సంకల్పంతోనే చేస్తానని..తాను రాష్ట్రానికి ఇంకా ఏదో చేయాల్సి ఉంది కాబట్టే ఆ రోజు నన్ను దేవుడు కాపాడారని అన్నారు. ఏపీ రాష్ట్రం మొత్తం శ్రీవారి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవారికి వెళ్లడం కూడా అంతే ముఖ్యమని సీఎం అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రజా పాలన ప్రారంభమైంది. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభం కావాలి. ప్రసాదాలు, తిరుమల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యం. అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు ప్రజలూ మమేకం కావాలి. నష్టపోయిన, ఇబ్బంది పడిన వర్గాలను ఆదుకోవాలి. రాజధాని అమరావతి, పోలవరం పడకేశాయి.. వాటిని పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. కక్ష సాధింపులు ఉండవు. తితిదేను ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతాం. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం” అని చంద్రబాబు అన్నారు.

ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో చంద్రబాబు.. తనదైన మార్క్ చూపించారు. ఎక్కడా పంతాలు, పట్టింపులకు పోకుండా గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను కంటిన్యూ చేయడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా.. మాజీ సీఎం జగన్ ఫొటో ఉన్నా సరే విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయవద్దని ఆదేశించారు. కాగా.. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ భవనాలకు అప్పటి ప్రభుత్వం పార్టీ రంగులు వేయించి నానా హడావుడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ బాబు మాత్రం ఆలా చేయద్దంటూ సూచించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం.

Read Also : Garlic Benefits: వెల్లుల్లి తింటే ఈ సమస్యలన్నీ దూరం..!