Pawan-Chandrababu: ముగిసిన భేటీ..రెండో జాబితాలో అభ్యర్థుల ఎంపికపై చర్చలు..!

  • Written By:
  • Publish Date - March 6, 2024 / 12:08 PM IST

 

 

Pawan-Chandrababu Key Meeting : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. గంటన్నరపాటు ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా రెండో జాబితాలో అభ్యర్థుల( second list candidates) ఎంపికపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. తొలి జాబితాలో టీడీపీ(tdp) 94 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన(janasena అధినేత పవన్ ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, రెండో జాబితాలో అభ్యర్థుల ఎంపికపై ఇరువురు నేతలు తాజా భేటీలో చర్చించినట్లు తెలిసింది.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ , జనసేన అభ్యర్థుల రెండో జాబితాను ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత ప్రకటించాలని ఇరు పార్టీల అధినేతలు తొలుత భావించారు. అయితే, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెండో జాబితాలో కొన్ని సీట్లను ప్రకటించేందుకు ఇరువురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రెండో జాబితాలో టీడీపీ తరపున కొన్ని సీట్లు, జనసేన తరపున కొన్ని సీట్లు ప్రకటించాలని నిర్ణయించారు. ప్రస్తుత భేటీలో ఏఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాలి అనే విషయంపై వీరి మధ్యచర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీల్లోని నేతల మధ్య కొన్ని సీట్ల విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని ఎలా కంట్రోల్ చేయాలి.. సీట్లు దక్కనివారికి ఏ విధంగా న్యాయం చేయాలి అనే అంశాలపైనా ఇరువు నేతలు చర్చించినట్లు సమాచారం.

read also: Underwater Metro Train: విద్యార్థులతో కలిసి అండర్‌ వాటర్‌ మెట్రోలో ప్రయాణించిన మోడీ

మరోవైపు టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ(bjp) చేరే అంశంపైనా గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వంతో ఏఏ అంశాలు చర్చించాలి.. సీట్ల సర్ధుబాటులో భాగంగా ఎన్నిసీట్లు కేటాయించాలి.. ఏఏ నియోజకవర్గాలు బీజేపీకి ఆఫర్ చేయాలి అనే విషయాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.