Site icon HashtagU Telugu

Nara Devansh Birthday: నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా TTDకి 38 లక్షల విరాళం

Nara Devansh Birthday

Nara Devansh Birthday

Nara Devansh Birthday: నారా లోకేష్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా లోకేష్-బ్రాహ్మణ దంపతులు మరియు భువనేశ్వరి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదానం చేశారు.

ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబకు అన్నదానం చేసేందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని నారావారి కుటుంబం విరాళంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తితిదే అన్నప్రసాదం ట్రస్టుకు ఒక్కరోజు బియ్యం పంపిణీకి రూ.38 లక్షలు విరాళంగా అందించారు లోకేష్. ఈ కార్యక్రమంలో నారా కుటుంబంతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు.

భువనేశ్వరి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. అలాగే లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ బుధవారం సాయంత్రం తిరుమలకు వచ్చారు. అనంతరం నారా కుటుంబ సభ్యులు ఈ ఉదయం తిరుమలేశుడిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని అన్నదానం చేస్తుంటారు. మరోవైపు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం ప్రారంభమైంది. విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు.

Also Read: Drugs : నడిరోడ్డుపై ఇంజెక్షన్‌తో డ్రగ్స్ ఎక్కించుకుంటున్న ఓ రిక్షా డ్రైవర్