Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ (Chandrababu Case) చేశారు సీఐడీ పోలీసులు. చంద్రబాబు సీఎంగా 2015లో స్కిల్ డెలవప్మెంట్ కోసం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం జరిగింది. రూ.3,356 కోట్ల ఈ ప్రాజెక్టు వ్యయంలో రూ.371 కోట్లు దారి మళ్లాయని ఆరోపణలు రాగా.. 2020 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 2020 డిసెంబర్ 10న విజిలెన్స్, 2021 FEBలో ACB విచారించగా.. డిసెంబర్లో కేసు CIDకి బదిలీ అయ్యింది. A1గా చంద్రబాబు, A2గా అచ్చెన్నాయుడు ఉన్నట్లు CID పేర్కొంది.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అర్థరాత్రి నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెడుతున్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబున సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిమీద చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తు అధికారి రాకుండా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు లాయర్లు ప్రశ్నించారు. అరెస్టుకు సంబంధించిన పేపర్లను సీఐడీ పోలీసులు చంద్రబాబుకు, లాయర్లకు ఇచ్చారు.
Also Read: AP : ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు..? – చంద్రబాబు
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏకంగా 26 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది.ఈడీ నోటీసులు అందుకున్న వారంతా 2014 నుంచి 2019 మధ్యన సాగిన తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో కీలకమైన భూమిక పోషించారు అని ఈడీ గుర్తించింది. అసలు ఈ కుంభకోణం ఏమిటి అన్నది చూస్తే.. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో సీమెన్స్ సంస్థ అప్పట్లో కీలకమైన ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 3,356 కోట్ల రూపాయలు ఈ కార్పోరేషన్ లో పెట్టుబడులు పెట్టడానికి అన్న మాట. అయితే ఇందులో పది శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 370 కోట్ల రూపాయలు మొత్తం ఉంటుంది. ఇక్కడే ఈడీ అక్రమాలు జరిగినట్లుగా గుర్తించింది. ఈ ప్రభుత్వ వాటాలోని 370 కోట్లలో సుమారు 241 కోట్ల 78 లక్షల 61 వేల 508 రూపాయలు దారి మళ్లినట్లు ఈడీ అధికారులు కనుగొనడంతో నోటీసులు జారీ చేసింది.