CBN Meets Revanth : చంద్రబాబు తో రేవంత్ భేటీ అయ్యారా..?

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 12:36 PM IST

గురువారం బేగం పేట్ ఎయిర్ పోర్ట్ (Begumpet Airport) లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ..మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లు సమావేశం అయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో లోక్ సభ హోరు నడుస్తుంటే..ఏపీలో అసెంబ్లీ హోరు నడుస్తుంది. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు నడుస్తున్నాయి.

కాగా గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తన రాజ‌కీయ గురువు, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు తో రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఢిల్లీ వెళ్లే క్రమంలో హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయంలో గురువారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ భేటీ జరిగినట్లు వినికిడి. బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారంతో పాటు ఏపీ రాజకీయాలలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాత్ర ఏ విధంగా ఉండాలి అన్న వ్యవహారంపై చంద్రబాబు, రేవంత్ చర్చించినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్…అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా 2024 ఎన్నికలలో టీడీపీ-జనసేన కూటమికి రేవంత్ రెడ్డి కూడా మద్దతు ఏ విధంగా తెలపాలి అన్న వ్యవహారంపై ఈ ఇద్దరు చర్చలు జరిపారని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని రేవంత్‌ను బాబు కోరినట్టు సమాచారం. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోటీడీపీ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో టీడీపీ కనీసం తన అభ్యర్థులను పోటీకి కూడా దించలేదు. ఇందుకు ప్రతిఫలంగా తనకు ఏపీ ఎన్నికల్లో సహకారం అందించాలని చంద్రబాబు కోరినట్టు చెప్తున్నారు. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరినప్పటికీ తగిన సాయం చేస్తానని రేవంత్‌ బాబు కు వాగ్దానం చేసినట్టు సమాచారం. అయితే అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీ పక్షాన మాత్రం ఎటువంటి మద్దతు ఉండదని చెప్పినట్టు వినికిడి. వీరి భేటీకి సంబంధించిన ఫొటోలు మాత్రం బయటకు రాకుండా గట్టి జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అందరూ మాత్రం విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.

Read Also : Sela Tunnel : సేలా టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ