టీడీపీ శ్రేణులకు , చంద్రబాబు (Chandrababu) కు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ (Skill Development Case )కేసులో చంద్రబాబు కు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా..ఇప్పుడు మద్యం కేసు(Liquor case)లో మరో ఊరట కల్పించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1గా నరేష్, ఏ2గా కొల్లు రవీంద్ర, ఏ3గా చంద్రబాబు పేర్లను సీఐడీ నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చారనే దానిపై పలు అభియోగాలను చేర్చింది. పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లుగా సీఐడీ వెల్లడించింది. దీంతో చంద్రబాబు తరుపు లాయర్లు మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ అత్యవసర పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై మంగళవారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈకేసులో దురుద్దేశపూర్వకంగానే చంద్రబాబును ఇరికించారని ఆయన తరఫు లయలరు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు (Chandrababu) బెయిల్ ఇచ్చినందున బెయిల్ గడువు ముగిసే వరకు అరెస్టు చేయబోమని తెలిపారు. ఈ మేరకు హైకోర్టుకు ఏజీ లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు నవంబరు 21కి వాయిదా వేసింది.
Read Also : Telangana : కొడంగల్‌లోనే గెలవని రేవంత్.. కామారెడ్డిలో గెలుస్తారా అంటూ కేటీఆర్ ఎద్దేవా