Chandrababu: ఎండలు మండుతుంటే.. పెన్షన్ కోసం సచివాలయాలకు రమ్మంటారా ? : చంద్రబాబు

Chandrababu: ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కేంద్ర ఎన్నికల సంఘాని(Central Election Commission)కి లేఖ(letter) రాశారు. తన లేఖ ప్రతిని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 40 డిగ్రీలకు పైన  ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో వృద్దులను, దివ్యాంగులను… ఇతర పెన్షన్ లబ్దిదారులను 3-4 కిలోమీట్లర్ల దూరంలో ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ తిప్పించుకోవడం మానవత్వం అనిపించుకోదు. అందుకే పింఛన్లను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు… pic.twitter.com/i5uuufd2pY — N Chandrababu […]

Published By: HashtagU Telugu Desk
Chandrababu Letter To The C

Chandrababu letter to the Chief Electoral Officer of India

Chandrababu: ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కేంద్ర ఎన్నికల సంఘాని(Central Election Commission)కి లేఖ(letter) రాశారు. తన లేఖ ప్రతిని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

“ఏపీలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో వృద్ధులను, దివ్యాంగులను, ఇతర పెన్షన్ లబ్ధిదారులను మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ తిప్పించుకోవడం మానవత్వం అనిపించుకోదు” అని చంద్రబాబు ట్వీట్ చేశారు. అందుకే పెన్షన్లను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేసేలా రాష్ట్ర సీఎస్ కు సూచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భారత ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశానని వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

పెన్షన్ పంపిణీలో రెండు విధానాలు సరికావని లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి కుట్రలకు, నాటకాలకు తెర దించాలని కోరారు. లబ్దిదారులందరికీ ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని తెలిపారు. సామాజిక పింఛన్ల పంపిణీ అనేది ప్రభుత్వ బాధ్యత అని ప్రస్తావించారు. ఆ బాధ్యతను సీఎం జగన్ సక్రమంగా నిర్వహించకుండా.. దురుద్దేశంతో వయోవృద్ధులు, దివ్యాంగులను అవస్థల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Vijay Deverakonda: దళపతి విజయ్ పాలిటిక్స్ పై అలాంటి కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ.?

స్వార్ధ ప్రయోజనాల కోసం ఎప్పుడూ లేని విధంగా, ఎన్నికల ముందు పింఛన్ల పంపిణీపై కుట్రలు చేస్తున్నారని లేఖలో మండిపడ్డారు. గతేడాది 2022 ఏప్రిల్ 1వ తేదీకి ముందే పింఛన్ల నిధులు బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి 1వ తేదీన పంపిణీ చేశారన్నారు. ఈ ఏడాది కూడా ముందే బ్యాంకుల నుండి విత్ డ్రా చేసి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఎదురయ్యేది కాదని ప్రస్తావించారు. మార్చి 16 నుండి మార్చి 30 మధ్య 15 రోజుల్లోనే సొంత కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు విడుదల చేశారు.. పింఛన్ దారులకు ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్లు కూడా సొంత కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానా ఖాళీ చేశారని పేర్కొన్నారు. నిధుల కొరత వల్లే పింఛన్ల పంపిణీ జాప్యం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

  Last Updated: 03 Apr 2024, 01:34 PM IST