Site icon HashtagU Telugu

Chandrababu Letter : ‘నన్ను అంతమొందించే కుట్ర జరుగుతోంది’ – ఏసీబీ జడ్జికి చంద్రబాబు లేఖ

Babu Letter

Babu Letter

స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)లో ఆరోపణలు ఎదురుకుంటూ గత 50 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..తన భద్రత, ఆరోగ్యంపై (Health And Security) అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీబీ జడ్జి (ACB Court Judge)కి మూడు పేజీల లేఖ రాసారు. ‘‘నాకు జెడ్ ప్లస్ సెక్యూర్టీ ఉన్నప్పటికీ.. నేను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా నన్ను వీడియోలు.. ఫొటోలు తీసి.. ఆ ఫుటేజ్‌ను పోలీసులే లీక్ చేసి, నా రెప్యూటేషన్‌ను దెబ్బ తీసేందుకే కుట్ర చేసారు. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. ఇప్పటికే రూ.కోట్లు చేతులు మారినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన లేఖను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఈ విషయమై లేఖ కూడా వచ్చింది. ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదు.

We’re now on WhatsApp. Click to Join.

జైల్లో డ్రగ్స్‌ కేసు నిందితుడు పెన్‌ కెమెరాతో తిరుగుతున్నాడు. ఆ ఖైదీ జైలు లోపల ఫొటోలు తీస్తున్నాడు. ఈనెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్‌ ఎగురవేశారు. నా కదలికలు తెలుసుకునేందుకు డ్రోన్‌ వాడారు. ములాఖత్‌లో నన్ను కలిశాక వారి చిత్రాల కోసం డ్రోన్‌ ఎగురవేశారు. నాతోపాటు నా కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. జైలుపై డ్రోన్ ఎగురవేసింది వైసీపీ వారేనని అనుమానం. ఈ విషయంపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. డ్రోన్‌ ఘటన ప్రధాన సూత్రధారి ఎవరో గుర్తించలేదు. ఇది జైలు అధికారుల నిస్సహాయతకు నిదర్శనం. కొందరు గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరారు. గార్డెనింగ్‌ విధుల్లోని ఖైదీలు వాటిని పట్టుకున్నారు. రాజమహేంద్రవరం జైల్లో మొత్తం 2,200 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 750 మంది డ్రగ్స్‌ కేసు నిందితులు. కొంతమంది ఖైదీల వల్ల నా భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. జడ్‌ ప్లస్‌ కేటగిరీ రక్షణలో ఉన్న నా భద్రతకు ఇది తీవ్రమైన ముప్పు” అంటూ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also : Motkupalli Narasimhulu : కాంగ్రెస్‌లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు