ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ పర్యటన(Davos Tour)కు బయలుదేరారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సహా అధికారుల బృందం కూడా ఉంది. గన్నవరం నుండి ఢిల్లీకి..అక్కడి నుండి అర్థరాత్రి 1.30 గంటకు జ్యూరిచ్ పయనం అవుతారు.
Naresh : మా అమ్మ బయోపిక్ తీస్తాను.. మా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలి.. నరేష్ కామెంట్స్..
రేపు జ్యూరిచ్‌లో పలు సమావేశాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, అక్కడి పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడం ప్రధాన లక్ష్యంగా సీఎం దృష్టి పెట్టారు. ముఖ్యంగా తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. అలాగే దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల కోసం తీసుకుంటున్న చర్యలను, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతలను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు.
ఇక గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో సీఎంను కలుసుకున్న అధికారులు, ఆయన పర్యటన విజయవంతం కావాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన చంద్రబాబు, అందరి మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.