Minister Nimmala Efforts: ఏపీలో భారీ వరదల ప్రవాహం కొనసాగుతుంది. విజయవాడలో పరిస్థితి మరింత ఉదృతంగా కొనసాగుతుంది. భారీ వరదల నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. చంద్రబాబు(Chandrababu) స్వయంగా పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెళ్లారు. విజయవాడలో ఆయన పర్యటించారు.
బుడమేరు గండ్లు ఎంతటి ఉపద్రవాన్ని తెచ్చిందో అందరికీ తెలిసిందే. అయితే బుడమేరు కాలువ పూడికతీత విషయంలో ప్రభుత్వం నిబద్దతతో పని చేసింది. ముఖ్యంగా మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. దీంతో స్వల్ప వ్యవధిలోనే పనులు పూర్తయ్యాయి. కాగా నిమ్మల రామానాయుడు పనితీరుపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.
బుడమేరు (Budameru) గండ్లు పూడ్చివేత పనులు శరవేగంగా జరిగాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో అధికారులు యుద్ధప్రాదిపదికన పనులు చేపట్టారు. మంత్రి నిమ్మల చొరవని అభినందించారు సీఎం చంద్రబాబు. జిల్లాలో కొనసాగుతున్న సహాయక చర్యలపై చర్చించేందుకు మంత్రులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు.
బుడమేరు గండ్లు పూడికతీత పనుల్లో కీలకపాత్ర పోషించిన మంత్రి రామానాయుడును, ఇరిగేషన్ అధికారులను సీఎం ప్రశంసిస్తూ, కాల్వల మౌలిక సదుపాయాలను పెంపొందించడం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, భవిష్యత్తులో వరద ముప్పును బాగా తగ్గించడానికి కట్టల ఎత్తును పెంచాలని మరియు పటిష్టం చేయాలని సూచించారు. అదనంగా, పులివాగు పొంగిపొర్లుతున్నందున ఈ ప్రాంతంలో మరింత వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, రాబోయే రెండు రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Yoga for Skin : యోగాతో మెరిసే చర్మాన్ని పొందగలరా…? నిజం తెలుసుకోండి..!