Janasena: జనసేన భవిష్యత్తుకు చంద్రబాబు బాట..!

అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అంటే టీడీపీ (TDP) పొత్తు అనివార్యంగా పవన్ (Pawan) భావిస్తున్నారు. అంతేకాదు 2029 నాటికి టీడీపీని కాదని అధికారంలోకి రావాలని విజన్ పెట్టుకున్నారు. పొత్తులతో బలపడి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎత్తుగడలను పవన్ ఏపీలో ప్లే చేస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan

Resizeimagesize (1280 X 720) 11zon

అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అంటే టీడీపీ (TDP) పొత్తు అనివార్యంగా పవన్ (Pawan) భావిస్తున్నారు. అంతేకాదు 2029 నాటికి టీడీపీని కాదని అధికారంలోకి రావాలని విజన్ పెట్టుకున్నారు. పొత్తులతో బలపడి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎత్తుగడలను పవన్ ఏపీలో ప్లే చేస్తున్నారు. లక్ష్య సాధనలో భాగమే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీచేయడం. భారతీయ జనతాపార్టీకి ఏపీలో ఒక శాతం కూడా ఓటుబ్యాంకు లేదు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీచేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదనే నిర్ణయానికి జనసేనాని వచ్చారు.

తెలుగుదేశం పార్టీతోపాటు బీజేపీని కూడా కలుపుకొని పొత్తులకు వెళ్లాలనేది పవన్ యోచనగా ఉంది. గత ఎన్నికల సమయంలో బీజేపీతో వివాదానికి దిగిన టీడీపీతో పొత్తుకు వెళ్లాలా? లేదా? అనే మీమాంసలో బీజేపీ ఉంది. బీజేపీ కలిసివచ్చినా, రాకపోయినా చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ వెళ్లడం ఖాయం. ఈ విషయాన్ని గమనించిన ఏపీ బీజేపీ నేతలు అధిష్టానానికి సమాచారం ఇచ్చారు. విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ పవన్ ను పిలిపించి మాట్లాడారు. మోడీని కలిసిన తర్వాత తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరిన పవన్ తన స్వరాన్ని మార్చుకున్నారు. మళ్లీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ప్రకటించారు. టీడీపీతో కలిసి వెళ్లి పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను జనసేన తరఫున అసెంబ్లీకి పంపించడంతోపాటు తాను కూడా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే పట్టుదలతో ఉన్నారు.

Also Read: Pawan Kalyan meets Chandrababu: ఏపీలో అరాచక పాలన.. భేటీ అనంతరం పవన్ కీలక వ్యాఖ్యలు.!

మరోవైపు ఏపీలోకి కాపు నేతలద్వారా అడుగుపెడుతున్న బీఆర్ఎస్.. టీడీపీ-జనసేన ఓటుబ్యాంకుపై గురిపెట్టిందంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ తో సఖ్యతగా ఉండటమేకాకుండా ఆ పార్టీల నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో తెలంగాణ బీజేపీతో పొత్తున్నప్పటికీ ఆయన వెనుకాడలేదు. కానీ ఏపీలో తమ ఓటుబ్యాంకుకే కేసీఆర్ గురిపెట్టడంతో జనసేనాని ఆలోచనలో పడ్డారు. బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా టీడీపీతో వెళ్లి కొంతమంది ఎమ్మెల్యేలను సాధించాలనుకుంటున్నారు.

వీరిద్వారా ప్రజలకు దగ్గరై 2029 ఎన్నికల్లో ఓంటరిపోటీకి సిద్ధమవుతున్నారు. జనసేనాని ఆలోచనలకు భిన్నంగా టీడీపిలోని ఒక వర్గం ఆలోచిస్తుంది. వెనుకబడిన వర్గాలు పవన్తో పొత్తు కారణంగా దూరం అవుతాయని భావిస్తున్నారు. దీంతో మళ్ళీ వైసీపీ వైపు బీసీలు వెళ్తారని చెబుతున్నారు. జనసేన కారణంగా టీడీపీకి నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.పైగా కనీసం 15 నుంచి 20 చోట్ల టీడీపీ పార్టీ త్యాగం చేయాలి. సర్వేలు కూడా టిడిపి, జనసేన పొత్తు పై పెద్ద సానుకూలత లేదు. ఒక వేళ టీడీపీ పొత్తుకు సిద్ధం అయితే భవిష్యతులో పక్కలో బళ్ళెం లా జనసేన ఎప్పటికి ఉంటుందని క్యాడర్ భావిస్తుంటుంది.

  Last Updated: 08 Jan 2023, 04:03 PM IST