Site icon HashtagU Telugu

Chandrababu : వైసీపీ ఫేక్ ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలి – చంద్రబాబు

Babu Teli

Babu Teli

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోషల్ మీడియా (Social Media) లో రాజకీయ పార్టీలకు సంబదించిన అనేక వీడియోలు వైరల్ (Fake VIdeos) అవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ (TDP) ఫై వైసీపీ చేస్తున్న ప్రచారం ఫై చంద్రబాబు (Chandrababu) పార్టీ నేతలతో దిశానిర్దేశం చేసారు. వైసీపీ ఫేక్ ప్రచారం తో ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తోందని..ఈ ప్రచారం ఫై పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గురువారం పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్నికల ప్రచారంలో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహలపై చర్చించారు. అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పేర్కొన్నారు. ప్రజలు నమ్మే వార్తా ఛానల్ పేరుతో తప్పుడు వీడియోల ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఫేక్ ప్రచారాలను ( Fake campaign ) ధీటుగా తిప్పికొడుతూ, సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఫేక్ ప్రచారానికి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ను సైతం వదలట్లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే బీసీలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు అన్నారు. ‘బీసీలకు పెళ్లికానుక రూ. లక్షకు పెంచుతాం. చంద్రన్న బీమా పరిహారాన్ని రూ. 10 లక్షలు అందిస్తాం. బీసీలకు పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తాం. రూ.1.50 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తాం. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం’ అని ఆయన హామీ ఇచ్చారు.

Read Also : Kaushik Reddy : పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలఫై పాడి కౌశిక్ కీలక వ్యాఖ్యలు