Chandrababu has not fulfilled Super Six Promises : ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు (Super Six Promises) అమలు చేయాలంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) విజయవాడ ధర్నా చౌక్ వద్ద వినూత్నంగా నిరసనకు దిగారు. ‘ధాలీ బచావో’ పేరిట నిర్వహించిన ఆందోళనలో ఆమె ప్లేటుపై గరిటెతో బాదుతూ నిరసన వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి మంచి ప్రభుత్వమా ? ముంచే ప్రభుత్వమా? అని ఆమె ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ మీది ముంచే ప్రభుత్వంగా భావిస్తుందని షర్మిల పేర్కొన్నారు. గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టే…ప్రజలు మంచి చేస్తారని మిమ్మల్ని నమ్మారని, కూటమిప్రభుత్వం సైతం విశ్వసనీయత కోల్పోతుందని వైఎస్ షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు ? శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని భావిస్తే ఈ 100 రోజుల ప్రణాళికలో ఉద్యోగాల కల్పన మీద మీ ప్లాన్స్ ఏమీ లేవన్నారు. ప్రభుత్వ పరంగా 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఎలా నింపుతారో ప్రణాళికలు లేవని షర్మిల విమర్శించారు.
రైతులకు సంబంధించి కొన్ని పథకాలను ఈ ఏడాది ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రూ.20 వేలు ఇస్తామని చెప్పిన హామీ అటకెక్కించారనిపిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు 7 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ కూటమి సర్కార్ కేవలం 2 లక్షల ఎకరాలే అని తేల్చింది. పరిహారంపై కోత పెట్టిన ప్రభుత్వాన్ని ముంచే ప్రభుత్వం అనారా ? రాష్ట్రంలో రైతుల కష్టాలు టీడీపీ కూటమికి కనిపించడం లేదా? వరదలో సర్వస్వం కోల్పోతే కేవలం 4 లక్షల మందికే పరిహారం ఇస్తారా? ప్రధాని మోదీకి కూడా రాష్ట్రమంటే తొలినుంచీ చిన్నచూపు ఉంది. వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకునేందుకు నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు.
Read Also : Vasthu Tips: ఈ వస్తువులు మీ ఇంట్లో ఆ దిశలో పెడితే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!