ఏపీలో అఖండ విజయం సాధించి అధికారం చేపట్టిన కూటమి సర్కార్… పెన్షన్ (Pensions ) దారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ పధకాలను అంటే అందరికి మక్కువే. తమకు అర్హత ఉన్న లేకపోయినా పథకాలను దక్కించుకోవాలని చూస్తుంటారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ప్రభుత్వ మంచి ఉద్దేశాన్ని నీరుగార్చుతూ.. కొంతమంది అక్రమార్కులు.. పెన్షన్ పొందుతుంటారు. వారికి అర్హత లేకపోయినా తాము దివ్యాంగులం అని చెప్పుకుంటూ.. వారు లబ్ది పొందుతున్నారు. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతోంది. దీంతో అనర్హుల ఫై వేటు వేసేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారు. పెన్షన్ అర్హత లేకపోయినా పెన్షన్ తీసుకుంటున్న వారిని గుర్తించి వారి పెన్షన్ ను కట్ చేయాలనీ ఆదేశాలు ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
దివ్యాంగుల కోటలో 8 లక్షల మంది పెన్షన్ తీసుకుంటుండగా 60 వేల మందికి మరోసారి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వారికీ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వారికీ పెన్షన్లు నిలిపివేయబోతున్నట్లు పేర్కొన్నారు. 60 వేల మందికి పైగా సదరం క్యాంపు ఏర్పాటు చేసి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. నకిలీ సర్టిఫికెట్లతో వచ్చే పెన్షన్ దరఖాస్తులను పక్కన పెట్టాలని మంత్రి బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు.
Read Also : Red Light Area : రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి వచ్చాక.. వైద్యురాలిపై సంజయ్ రాయ్ హత్యాచారం