Site icon HashtagU Telugu

Chandrababu : ఉగాది పర్వదినాన వాలంటీర్లకు చంద్రబాబు తీపి కబురు

Babu Ugadi Gift

Babu Ugadi Gift

ఉగాది (Ugadi) పర్వదినాన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu).. వాలంటీర్ల(Volunteers )కు తీపి కబురు (Good News) అందజేశారు. తాము అధికారంలోకి వస్తే రూ.5 వేల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని.. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని.. వారిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఉగాది సందర్బంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తెలుగు వారు గొప్పగా నిర్వహించుకునే పండగ ఉగాది అని, కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అయిదేళ్ల కష్టాలు మర్చిపోయి కొత్త ఆశలతో ఉగాదిని ప్రారంభిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. జీవితాల్లో వెలుగులు వస్తాయనే సంకల్పం ప్రతీ ఒక్కరూ చేయాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమం అందడంతో పాటు అభివృద్ధి జరగాలని, ధరలు తగ్గాలని, శాంతిభద్రతలు అదుపులో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సంపద సృష్టి జరిగి మంచి కోసం ఖర్చు జరగాలని అభిప్రాయపడ్డారు. గత అయిదేళ్లుగా ఉగాది పచ్చడి లాంటి షడ్రుచులు రాష్ట్రంలో లేవని విమర్శించారు. పాలన మొత్తం చేదు, కారంతో నింపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమాజంలో జగన్ కు స్థానం లేకుండా కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ముస్లిం సోదరులు సహా, ఈ గడ్డపై పుట్టిన ప్రతీ ఒక్కరికీ మేలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10 వేల రూపాయల గౌరవ భృతి అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇదే కాకుండా వాలంటీర్లల్లో చదువుకున్న వారికి అద్భుతమైన ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. వృద్ధులకు 4000, దివ్యాంగులకు 6000 ఫించన్ ఇస్తామని హామీ ఇచ్చారు.

Read Also : Tamanna Vs Pawan Kalyan : పవన్ కల్యాణ్‌పై తమన్నా పోటీ.. సంచలన నిర్ణయం