Site icon HashtagU Telugu

Chandrababu Good News: పోలవరం నిర్వాసితులకు సంక్రాంతి పండుగ ముందే

Chandrababu Good News To Po

Chandrababu Good News To Po

పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు (Polavaram Project Victims) సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని చెప్పవచ్చు. చాలా సంవత్సరాలుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం శుభవార్త (Chandrababu Good News ) అందించింది. మొత్తం 10 వేల మంది నిర్వాసితులకు రూ.1,000 కోట్లు విడుదల చేయగా, 2014 నుండి 2019 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే రూ.1,620 కోట్లు జమ చేసింది. ఇప్పుడు తాజాగా పోలవరం ఆర్ అండ్ ఆర్ మరియు భూసేకరణకు రూ.996 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేసింది.

2014 ఎన్నికల తరువాత చంద్రబాబు కృషి చేయడం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరగా సాగింది. 2019 వరకు 72 శాతం పనులు పూర్తి అయ్యాయి. 72 శాతం పనుల కోసం రూ.11,537 కోట్లు ఖర్చు చేసి, వివిధ సాంకేతికతలతో రికార్డు స్థాయి పనులను చేసి, పోలవరం ప్రాజెక్టును గిన్నీస్ బుక్ లో స్థానం పొందేలా చేసారు. కానీ 2019లో జగన్ సీఎం అయినతరువాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం మొదలైంది. జులై 29, 2019న పోలవరం పనులను నిలిపి వేసిన జగన్, ప్రాజెక్టు నిర్మాణంపై తీవ్రంగా ప్రతికూల చర్యలు తీసుకున్నాడు. దీంతో రైతులకు, ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లింది.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ నిధులను విడుదల చేయడం ప్రారంభించింది. 2026 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ గతంలో జగన్ ప్రభుత్వం నిర్వాసితులకు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పోలవరం ప్రాజెక్టు వద్ద రూ.248 కోట్లు వైఎస్ ఆర్ విగ్రహం నిర్మాణానికి ఖర్చు చేస్తామని చెప్పిన జగన్, నిర్వాసితులకు ఎలాంటి సాయం చేయలేదు.

Read Also : Dokka Seethamma Mid Day Meal : “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన ” పథకాన్ని ప్రారంభించిన నారా లోకేష్