పోలవరం నిర్వాసితులు (Polavaram Project Victims) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నష్టపరిహారం (Compensation) అందింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్వాసితులకు 786 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో పోలవరం ముంపు బాధిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ నిధులు నిర్వాసితుల ఆకౌంట్లలో నేరుగా జమ చేయడం విశేషం.
పోలవరం జాతీయ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన నిర్వాసితులు ఏడేళ్లుగా నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులకు 800 కోట్ల నష్టపరిహారం అందజేసింది. అయితే 2019-24లో జగన్ ప్రభుత్వం నిర్వాసితుల కోసం ఎటువంటి సహాయం చేయలేదు. ఎన్నికల సమయంలో 10 లక్షల అదనపు పరిహారం హామీ ఇచ్చినా, ఆ హామీని నెరవేర్చడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం తొలిదశలో నష్టపరిహారం అందజేయడం నిర్వాసితుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వారి ఆర్థిక పరిస్థితి కొంతగానైనా మెరుగుపడుతుందని నిర్వాసితులు భావిస్తున్నారు. నష్టపరిహారం చెల్లింపుతో వారి గోడును తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. నిర్వాసితుల హక్కుల కోసం పోరాడుతూ, ఎన్నో వినతి పత్రాలు సమర్పించినా గతంలో వారికి ఎటువంటి సహాయం అందలేదు. ఇక ఇప్పుడు నిరుపేద నిర్వాసితులకు సంక్రాంతి సందర్భంలో చంద్రబాబు అందించిన ఈ సాయం, ప్రభుత్వ తీరుకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Yuzvendra Chahal: భార్యకు విడాకులు ఇవ్వనున్న యుజ్వేంద్ర చాహల్.. సాక్ష్యమిదే!
ఈ నిర్ణయంతో బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మిగిలిన నిర్వాసితుల సమస్యలను కూడా త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ ముందడుగు భవిష్యత్ పాలనకు ఆదర్శంగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వం నిర్వాసితుల గోడు పట్టించుకున్న దాఖలాలు లేవు సరికదా అప్పటికే కీలక దశలో నిర్మాణంలో ఉన్న పునరావాస కాలనీలు అయినా పూర్తి చేశారా అంటే అదీలేదు. ఓ వైపు ఆకస్మిక వరదలు, మరో వైపు ఉండటానికి ఇళ్ళు లేక గత అయిదేళ్ళలో పోలవరం నిర్వాసితులు దగ్గరలోని మండలాలకు వలస వెళ్ళి అద్దె చెల్లించుకుంటూ బతుకు భారంగా గడపాల్సిన పరిస్థితి. వైసిపి ప్రభుత్వం 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కేవలం ఓ గ్రామంలోని అయిదారుగురికి మాత్రమే నష్టపరిహారం కింద 10లక్షల రూపాయలు అందించి మరలా పోలవరం నిర్వాసితుల ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
Worlds Oldest Person : ప్రపంచంలోనే వృద్ధ మహిళ ఇక లేరు.. 116 ఏళ్ల బామ్మ తుదిశ్వాస
ఐతే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మా మొదటి ప్రాధాన్యత, నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. హామీ ఇవ్వటమే కాకుండా దాన్ని అమలుపరిచేలా పలు మార్లు ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇలా కేంద్ర పెద్దలను కలసి ఒప్పించి ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణానికి 12,157 కోట్ల రూపాయాల నిధులు సాధించి తీసుకొచ్చారు. గత అయిదేళ్ళ పాలనలో విధ్వంశమైన పోలవరం ప్రాజెక్టు పనులను మరలా గాడిలో పెట్టిలా ఇటీవలే ప్రాజెక్టు ను సందర్శించి కీలకమైన ఈసిఆర్ఎఫ్ నిర్మాణ పనులకు సంబందించిన వర్క్ షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. అనంతరం మరలా ఢిల్లి వెళ్ళి ప్రధాన మంత్రిని కలసి నిర్వాసితులకు వెంటనే న్యాయం చేయాలని చెప్పి ఒప్పించి సంక్రాంతి కానుకగా 817 కోట్ల రూపాయల నిధులను దాదాపు 10 వేల మంది కి పైగా నిర్వాసితుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. గతంలో 2014-19 పాలనలో ఒకే సారి 800 కోట్ల రూపాయలు నిర్వాసితుల ఖాతాల్లో జమ చేయగా, ఇప్పుడు మరలా అదేవిధంగా నిర్వాసితులకు పరిహారం అందజేయడంలో నిర్వాసిత గ్రామాల్లో పది రోజులు ముందుగానే సంక్రాంతి కళ సంతరించుకుంది.
Kakani Govardhan Reddy : కూటమి పాలనను ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై తప్పుడు కేసులు
ఇలా ఓవైపు ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయడం ద్వారా సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసి కరువు రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దడంతో పాటు, గోదావరి జలాలను ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమకు తరలించేలా ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరో వైపు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సకాలంలో నష్టపరిహారం అందించేందుకు నిధులు సాదించేలా కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నారు. పునరావాస కాలనీల నిర్మాణ పనులతో పాటు మౌళిక వసతుల కల్పన పై ప్రత్యేక దృష్టి పెట్టి పొలవరం ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రధాన ఎజెండాగా పని చేస్తోంది కూటమి ప్రభుత్వం.