Chandrababu: ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి కూటమి రోడ్ షో నిర్వహించింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఉమ్మడిగా నిర్వహించిన రోడ్‌షోలు, బహిరంగ సభలకు జనాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ రోడ్ షోకి భారీగా జనం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు. నలభై ఏళ్లలో ఇంత ఉత్సాహాన్ని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో జనసంద్రాన్ని చూస్తేనే అర్ధం అవుతుందని అన్నారు. ఇప్పటికే ఓటర్లు తేల్చి చెప్పినట్లు అర్థమవుతోందన్నారు. జగన్ సిద్దం అంటూ సభలు పెట్టుకుని తిరుగుతున్నారని, అయితే తనను ఓడించేందుకు ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.
పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటేనని చెప్పిన ఆయన, ఈ మూడు పార్టీల గుర్తులకు ప్రజలు ఓటేయాలని కోరారు. గుర్తుతో సంబంధం లేకుండా మూడు పార్టీల అభిమానులు కలిసి ఓటు వేసి చారిత్రత్మక విజయాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహాకూటమి విజయం రాష్ట్ర పునర్నిర్మాణానికి అపూర్వ అవకాశం అని అన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రరాజ్యంగా ఆవిర్భవిస్తుందని.. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామ్యం కావాలని బాబు అన్నారు.
2014లో జగన్ మోహన్ రెడ్డి తండ్రి లేని బిడ్డగా ఎన్నికలకు వచ్చారని, 2019లో తండ్రిని చంపి ఆ సానుభూతితోనే ఓట్లు వేయించుకున్నారని కామెంట్స్ చేశారు చంద్రబాబు. ఇప్పుడు వృద్ధుల మరణాలతో ఓట్ల కోసం కుట్రలు చేస్తున్నారన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మరోవైపు మత రాజకీయాలను, ప్రాంతీయ వివాదాలను రెచ్చగొడుతున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయకపోతే పెను ప్రమాదం సంభవిస్తుందని, జగన్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎన్డీయే కూటమి గెలిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైఎస్సార్‌సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలను ఎన్డీయే కూటమి అమలు చేస్తుందన్నారు.
We’re now on WhatsApp. Click to Join
జగన్ మోహన్ రెడ్డిలా తన వైఖరి చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా.. దానిని రాజకీయ కార్యక్రమాలకు వినియోగించాలన్నది ఆయన విధానం. ప్రజావేదికను కూల్చివేసిన జగన్ లాగా తాను ఎప్పుడూ పాత ప్రభుత్వాలు చేసిన వాటిని నాశనం చేయలేదన్నారు. వాలంటీర్ వ్యవస్థ రాజకీయ పార్టీలకు సేవ చేయకూడదని, ప్రజలకు సేవ చేయాలని తాను మొదటి నుంచి చెబుతున్నానని బుధవారం రాత్రి జరిగిన నిడదవోలు సభలో పేర్కొన్నారు.
Also Read: RR vs GT: గుజరాత్ బౌలర్లని ఉతికారేసిన సంజూ శాంసన్, రియాన్ పరాగ్..