బెంగాల్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు కోల్‌కతాలో పర్యటించనున్నారు. పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటన షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర జాతీయ స్థాయి నాయకులు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. విజయవాడ నుంచి కోల్‌కతాకు.. వివరణాత్మక షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు శనివారం ఉదయం 7:05 గంటలకు ఉండవల్లిలోని […]

Published By: HashtagU Telugu Desk
CM Chandrababu

CM Chandrababu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు కోల్‌కతాలో పర్యటించనున్నారు. పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆయన పర్యటన షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర జాతీయ స్థాయి నాయకులు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

విజయవాడ నుంచి కోల్‌కతాకు.. వివరణాత్మక షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు శనివారం ఉదయం 7:05 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరతారు. హెలికాప్టర్ ద్వారా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, ఉదయం 7:40 గంటలకు ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు పయనమవుతారు. ఉదయం 9:20 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమ వేదికకు వెళ‌తారు.

కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వానికి, నాయకత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా విమానాశ్రయం నుంచి తిరిగి బయల్దేరతారు. సాయంత్రం 3:45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు.

  Last Updated: 08 May 2026, 09:03 AM IST