ప్రజలకు కూటమి (AP Govt) ప్రభుత్వం మరో శుభ వార్తను అందించింది. దివ్యాంగ చిన్నారులకు (Disabled Children) రవాణా చార్జీలకు (Transportation Charges)గాను గత పది నెలలుగా నిలిచిపోయిన నగదును తక్షణమే ఖాతాలకు జమ చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM CHandrababu) ఆదేశించారు. ఈ నిర్ణయంతో పలు నెలలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భవిత కేంద్రాలు దివ్యాంగ పిల్లలకు మరింత ఆత్మస్థైర్యాన్ని అందించేందుకు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు మానసిక వైకల్యాలను అధిగమించి చిన్నారులు సామాజిక జీవితంలో చురుకుగా పాల్గొనేలా శిక్షణ ఇస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి నెలా ఒక్కో విద్యార్థికి రూ. 300 రవాణా చార్జీ చెల్లిస్తుంది. అయితే, గత 10 నెలలుగా ఈ చార్జీలు తల్లిదండ్రుల ఖాతాల్లో జమ కాకపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు తీసుకున్నారు. “దివ్యాంగ పిల్లలకు ఇవ్వాల్సిన నగదుకు ఇంత నిర్లక్ష్యం ఎలా జరిగింది” అంటూ అధికారులను నిలదీశారు. బకాయి మొత్తాన్ని వెంటనే చెల్లించి, తల్లిదండ్రులకు ఆర్థిక భారం తొలగించాలని సీఎం ఆదేశించారు.
సీఎం ఆదేశాల ప్రకారం, గత 10 నెలల రవాణా చార్జీలను రూ. 3000 చొప్పున తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించినందుకు దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also : Telangana AI Revolution : హైదరాబాద్‌లో ఏఐ సిటీ.. తెలంగాణలో ఏఐ విప్లవం.. రేవంత్ సర్కారు అడుగులు