Site icon HashtagU Telugu

Chandrababu Quash Petition : సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు ..

chandrababu filed quash petition in the supreme court

chandrababu filed quash petition in the supreme court

చంద్రబాబు క్వాష్ పిటిషన్ (Chandrababu Quash Petition) ను ఏపీ హైకోర్టు (AP High court) తిరస్కరించడంతో..చంద్రబాబు తరుపు లాయర్లు క్వాష్ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ లో దాఖలు చేసారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబుపై నమోదు చేసిన కేసు రిమాండ్ రిపోర్టును క్వాష్ (Chandrababu Quash Petition) చేయాలని కోరుతూ ఆయన తరఫున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..హైకోర్టు మాత్రం CID వాదనలకే మొగ్గు చూపిస్తూ..చంద్రబాబు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీంతో చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు.

ఏపీ హైకోర్టు లో చంద్రబాబు తరుపు లాయర్లు.. లూథ్రా, హరీష్ సాల్వే (Lawyers Sidharth Luthra, Harish Salve) లు..ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకపోవడమే కాకుండా.. గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదని, చట్ట విరుద్ధంగా చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదని హైకోర్టు కు తమ వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు.

ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లుగా ఎక్కడా ఆధారాలు చూపలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే తరహా సెక్షన్ల కేసుల్లో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, మార్గదర్శకాలను లాయర్స్ ప్రస్తావించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు కేసును క్వాష్ చేయాలని కోరారు. అయితే హైకోర్టు మాత్రం CID వాదనలకే మొగ్గు చూపిస్తూ..చంద్రబాబు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఇక ఇప్పటి వరకు ఏపీలో ఉన్న కేసు ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నారా లోకేష్.. సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేంతవరకు ఢిల్లీలోనే లోకేష్ ఉండనున్నారని తెలుస్తోంది. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట వస్తుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also : Aparna Iyer: విప్రో కొత్త సీఎఫ్‌ఓగా అపర్ణ అయ్యర్.. ఎవరీ అపర్ణ అయ్యర్..!