కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదం(Karnataka Road Accident)లో ఏపీ వాసులు (AP People) మృతి (Dies)చెందడంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింధనూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో తుఫాను వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనం డ్రైవర్ సహా నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను ఎంతగానో బాధించిందని, ఈ బాధను మాటలతో వ్యక్తం చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
IT Rides : డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్
ఈ ఘటనపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదం జరగడం బాధాకరమని , ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్యసేవలు అందించాలని సంబంధిత అధికారులను చంద్రబాబు ఆదేశించారు. వారికి అన్ని విధాలా సాయం అందించాలని, అవసరమైతే ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థికంగా, మానసికంగా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. వేద విద్యార్థుల కుటుంబాలతో పాటు ప్రమాదంలో మరణించిన డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలపై మరింత అవగాహన కల్పించి, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
APSRTC : ఏపీ ఆర్టీసీకి ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఆదాయం..
ఈ ప్రమాదం పై పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..మంగళవారం రాత్రి కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి వేదపాఠశాల విద్యార్థులు కర్ణాటకలోని హంపి క్షేత్రానికి బయలుదేరారు. అక్కడ నరహరి తీర్థుల ఆరాధనకు 14 మంది విద్యార్థులతో వాహనం బయల్దేరిందని , ఈ క్రమంలో సింధనూరు సమీపంలో వాహనం బోల్తాపడిందన్నారు. ఈ ఘటనలో డ్రైవర్ శివ, ముగ్గురు విద్యార్థులు సుజేంద్ర, అభిలాష, హైవదన అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.