Chandrababu: లక్ష మెజారిటీతో కుప్పంలో గెలిపించాలా !

టీడీపీ కంచుకోట కుప్పం నుంచే ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పోటీ చేస్తుంటారు. గత ఎన్నికల్లో కుప్పం ప్రజలు ఆయనను గెలిపించి అసీంబ్లీకి పంపించారు.

Published By: HashtagU Telugu Desk
Chandrababu

New Web Story Copy (78)

Chandrababu: టీడీపీ కంచుకోట కుప్పం నుంచే ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పోటీ చేస్తుంటారు. గత ఎన్నికల్లో కుప్పం ప్రజలు ఆయనను గెలిపించి అసీంబ్లీకి పంపించారు. వైసీపీకి 151 సీట్లు గెలుచుకోగా, టీడీపీ 21 సీట్లకే పరిమితమైంది. అయితే ఈ సారి వచ్చే ఎన్నికల్లో కుప్పంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఓ వైపు టీడీపీకి కుప్పానికి ఉన్న సంబంధాన్ని తెగ్గొట్టాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నది. ఈ సమయంలో చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తూ కుప్పం ప్రజలకు తన అభివృద్ధిని, చేయాల్సిన కార్యక్రమాలను వివరిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ చీఫ్ చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజారిటీ సాధిస్తామని చెప్పారు. అదేవిధంగా కుప్పంలో వైసీపీ గుండాలు హల్చల్ సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.

కుప్పంలో రెండవ రోజు పర్యటనలో భాగంగా నాయుడు మాట్లాడుతూ.. సంపద సృష్టించిన పార్టీ తెలుగు దేశం పార్టీ. కుప్పం మరింత అభివృద్ధి చెందాలి అంటే మళ్ళీ కుప్పంలో టీడీపీ గెలవాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో లక్ష మెజారిటీతో గెలిపించాలని అన్నారు చంద్రబాబు. ఎన్నికలకు గడువు ఇంకా ఆరు నెలలే ఉన్నదని, అయితే ఈ నాలుగేళ్లలో వైసీపీ కుప్పంలో అభివృద్ధిని అడ్డుకున్నదని ఆరోపించారు. కుప్పంలో వైసీపీ రౌడీలో హల్చల్ చేస్తున్నారని, ఇటీవల కుప్పంలో వ్యక్తిపై వైసీపీ నాయకులు చేసిన దాడిని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు.

కుప్పంని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు చంద్రబాబు. పేదలని ధనికులుగా మార్చే బాధ్యత తీసుకుంటాను. ఈ క్రమంలో 18 నుంచి 59 వయసు గల మహిళలకు 1500 ఇస్తానని, పిల్లల చదువు కోసం తల్లి వందనం పథకం కిందా ఏడాదికి 15 వేలు ఇస్తానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే టీడీపీకి ఓటేసి గెలిపించాలని కోరారు చంద్రబాబు.

Read More: Fake Constable: హైదరాబాద్ లో నకిలీ మహిళా కానిస్టేబుల్ అరెస్ట్

  Last Updated: 15 Jun 2023, 06:26 PM IST