Site icon HashtagU Telugu

2000 Rs Note : నోట్ల రద్దు చేయాలని నేను అప్పుడే చెప్పాను.. చంద్రబాబు కామెంట్స్..

Independence Day 2023

Chandrababu comments on 2000 Rupees note Withdraw

మోడీ(Modi) ప్రభుత్వం 2016లో చేసిన డిమానిటైజేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాని వల్ల ఎంత మంచి జరిగిందో, చెడు కూడా జరిగింది. అప్పుడు నోట్ల రద్దు తర్వాత 2016 నుంచి 2000 రూపాయల నోటు మార్కెట్లో చెలామణిలో ఉంది. కానీ గత కొన్ని రోజులుగా ఈ నోటు బయట ఎక్కువగా కనపడట్లేదు. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఈ నోట్ల ప్రింటింగ్ ను నిలిపివేసినట్లు ఆర్బీఐ(RBI) ప్రకటించింది.

తాజాగా 2 వేల రూపాయల నోట్లకు సంబంధించి ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది. ఆ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించింది. రెండు వేల రూపాయల నోట్లను సెప్టెంబర్ 30లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని, బ్యాంకులు కూడా వినియోగదారులకు ఆ నోట్లు ఇవ్వొద్దని తాజాగా RBI ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 2000 రూపాయల నోటు వెనక్కి తీసుకోవడంపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

కొన్ని నెలల్లో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు 2000 రూపాయలు నిలిపివేస్తుండటం రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది. తాజాగా దీనిపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు అనకాపల్లి పర్యటనలో ఉన్నారు. అక్కడ రోడ్ షోలో దీని గురించి మాట్లాడారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. డిజిటల్ కరెన్సీ నేను ఎక్కువగా ప్రొత్సహించాను. పెద్ద నోట్లు రద్దు చేయ్యాలని నేను అప్పడే చేప్పాను. దేశంలో అవినీతి పరులు చాలా మంది ఉన్నారు. పెద్ద నోట్ల వల్ల అవినీతి అక్రమ లావా దేవీలు పెరిగాయి. నేను అనకాపల్లిలోకి రాగానే 2000 నోట్లు వెనక్కు తీసుకుంటున్నట్లు సమాచారం వచ్చింది. RBI తీసుకున్న నిర్ణయం హర్షనీయం. ఈ నిర్ణయం ఎంతోమంది అవినీతిపరులకు నిద్ర లేకుండా చేస్తుంది అని అన్నారు. దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

 

Also Read : RBI: రూ.2 వేల నోట్లను రద్దు చేయడానికి కారణం ఇదేనా.?.