చంద్రబాబు (Chandrababu) కు సంబదించిన ఏ కేసుకు కూడా ముగింపు అనేది రావడం లేదు..చంద్రబాబు ఫై నమోదైన కేసులన్నీ విచారణ జరగడం..తీర్పును రిజర్వ్ చేయడం కామన్ అయ్యింది. ఈరోజు కూడా బెయిల్ పిటిషన్ ఫై అదే జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development Scam Case)లో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ (Chandrababu Bail) పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనల తర్వాత న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈ రోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy) చంద్రబాబు కు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని, రిపోర్ట్స్ అన్నీ కూడా నిజం కాదని కోర్టుకు తెలియచేసే ప్రయత్నం చేశాడు. ఇక సిద్ధార్థ లూధ్రా (Sidharth Luthra) వాదనలు చూస్తే.. 2018 నుంచి విచారణ చేస్తున్నామని చెబుతన్నారని.. ఏం తేల్చారని ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ.. తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏఏజీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు ప్రచారం చేసి అడ్వకేట్స్ ఎథిక్స్ కు వ్యతిరేకంగా ప్రవర్తించారన్నారు. ఎన్నికలు వస్తున్న సమయంలో చంద్రబాబును ప్రజా జీవితానికి దూరం చేయడానికే ఇలాకేసులు పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైల్లో పెట్టడం వల్ల చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతిన్నదన్నారు. అన్ని విషయాలను పరిశీలించి బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇరు పక్షాల వాదనలను విన్న హై కోర్ట్ ఈ కేసు తీర్పును రిజర్వు చేసింది. మరి బాబు కు బెయిల్ వస్తుందా..? రాదా..? న్యాయమూర్తి ఏ తీర్పు ఇస్తారు అనేది చూడాలి.
Read Also : Prabhas : రాయలసీమ యాక్షన్ కథ కాదని.. ‘చక్రం’ సినిమా తీసిన ప్రభాస్..