Chandrababu : చంద్రబాబు కు బెయిల్ రావడం తో సంబరాల్లో టీడీపీ శ్రేణులు

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబు (Chandrababu) ను నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - October 31, 2023 / 02:22 PM IST

చంద్రబాబు కు బెయిల్ (Chandrababu Bail) రావడం ఫై యావత్ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పులి బయటకు వస్తుంది..ఇక ఆట మొదలైనట్లే.. అంటూ టీడీపీ శ్రేణులు కామెంట్స్ వేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు (Skill Development case)లో సెప్టెంబర్ 9న చంద్రబాబు ను నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ (Chandrababu Arrest) చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10న ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో హాజరుపరిచారు. అనంతరం 10న అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించారు. గత 53 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry Central Jail)నే ఉన్నారు.

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయినా దగ్గరి నుండి కూడా ఆయన్ను బయటకు తీసుకొచ్చేందుకు లాయర్లు ట్రై చేస్తూ వస్తున్నప్పటికీ..వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్య గా చంద్రబాబు ఫై అనేక కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేసింది. ఇదే క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం దృష్టిలో పెట్టుకొని ఆయనకు బెయిల్ మంజుల చేయాలనీ హైకోర్టు ను కోరారు. దీంతో ఏపీ హైకోర్టు (AP High Court) చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

నాలుగు వారాలపాటు నవంబర్ 24 వరకు అనుమతిచ్చింది. రూ.1 లక్ష పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న చంద్రబాబు (Chandrababu), టీడీపీ అభిమానులకు కోర్టు తీర్పు సంతోషాన్ని కలిగించింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నవంబర్‌ 24న బాబు తిరిగి సరండర్‌ కావాలని ఆదేశించింది. దాంతో పాటు బెయిల్ మీద బయటకు వెళ్లాక ఆస్పత్రికి వెళ్లడం మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని, ఫోన్‌లో మాట్లాడకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే పలు షరతులు విధించింది.

చంద్రబాబు (Chandrababu) కు కోర్టు విధించిన షరతులు చూస్తే..

1. పిటిషనర్ చంద్రబాబు రూ.1 లక్ష పూచీకత్తుతో 2 షూరిటీలు ట్రయల్ కోర్టుకు సమర్పించాలి.

2. పిటిషనర్ చంద్రబాబు ఆయనే సొంతంగా పరీక్షలు చేయించుకొని/చికిత్స తీసుకోవాలి. హాస్పిటల్ ఎంపిక ఆయన సొంత నిర్ణయం. ఖర్చు ఆయనే పెట్టుకోవాలి.

3. తాను తీసుకున్న చికిత్సకు సంబంధించిన వివరాలను పిటిషనర్ కోర్టుకు తెలియజేయాలి. ఏ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కి సీల్డ్ కవర్‌ ద్వారా ఈ సమాచారం అందించాలి. ఈ సీల్డ్ కవర్‌ను అధికారి ట్రయల్‌కు పంపించాలి.

4. పిటిషనర్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కేసుతో సంబంధమున్న ఏ వ్యక్తినీ ప్రలోభపెట్టడం, బెదిరింపులు లేదా హామీలు ఇవ్వడం లాంటివి చేయకూడదు. కోర్టు లేదా మరేదైనా సంస్థకు సంబంధించిన వివరాలు చెప్పాలని కోరకూడదు.

5. నవంబర్ 28, 2023న సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలులో తనంతట తానే సరెండర్ కావాలి.

6 . ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు.

7 .కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయవద్దు

8 . ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి, ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది…

9 . చంద్రబాబుతో ఇద్దరు DSPలు ఎస్కార్ట్ ఉంచాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి..

10 . Z+ సెక్యూరిటీ విషయంలో… కేంద్ర నిబంధనలమేరకు అమలు చేయాలని, చంద్రబాబు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని తెలిపింది.

చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పెద్ద ఎత్తున బాణా సంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటూ..పులి బయటకు వస్తుంది..ఇక రాష్ట్రంలో ఆట మొదలైనట్లే అని చెపుతున్నారు. కాసేపట్లో చంద్రబాబు తో కుటుంబ సభ్యులు ములాఖత్ కాబోతున్నారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. బయటకు రాగానే నేరుగా విజయవాడకు వెళ్లి అక్కడి నుంచి తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత అక్కడి నుండి హైదరాబాద్ కు వెళ్లనున్నారు. ఆ తర్వాత LV ప్రసాద్ హాస్పటల్ లో కంటి పరీక్షలు చేయించుకోనున్నారు. చంద్రబాబు బయటకు రాబోతుండడం తో టీడీపీ నేతలతో పాటు కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో బిజీ కానున్నారు. అలాగే జనసేన అధినేత కూడా మరో రెండు , మూడు రోజుల్లో హైదరాబాద్ కు రానున్న తరుణంలో చంద్రబాబు తో నేరుగా కలిసే అవకాశం ఉంది.

ఇక చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబును అక్రమ కేసుల్లో ఇరికించడాన్ని బీజేపీ మొదటి నుంచి తప్పు పడుతోందని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకపోయిన అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తాము తప్పు పడుతున్నామని చెప్పారు. బాబుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైనందుకు హర్షం వ్యక్తం చేశారు.

Read Also : Apple Warning : వారి ఐఫోన్లకు ‘స్టేట్ స్పాన్సర్డ్’ ఎటాక్ ముప్పు.. పలువురు ప్రతిపక్ష నేతలకు అలర్ట్ మెసేజ్