Book Release Event : దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి తోడల్లుళ్లు సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వెంకటేశ్వరావు గురించి చంద్రబాబు అనేక విషయాలు చెప్పి సభకులను నవ్వించారు. వాటిలో చాలామందికి తెలియని విషయాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకం గురించి తన కంటే ముందే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్ని విషయాలు చెప్పేశారని చంద్రబాబు అన్నారు.
Read Also: Shresta Iyer: ఐటమ్ సాంగ్‌తో మెరుపులు.. శ్రేయస్ అయ్యర్ సోదరి వివరాలివీ
ఎన్టీఆర్ నుంచి తామిద్దరం అన్ని విషయాలు నేర్చుకున్నామని చెప్పారు. రచయిత కానటువంటి వెంకటేశ్వరరావు రచయిత అయ్యారని వ్యాఖ్యానించారు. అందుకే ఈ ప్రపంచ చరిత్ర పుస్తకం మీరే రాశారా? అని అడిగానని చంద్రబాబు తెలిపారు. ఎవరూ చేయనంత సాహసం ఆయన చేశారని వివరించారు. ప్రపంచతత్వం, నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని ప్రశంసించారు. ఆయన పుస్తకం రాస్తారని తాను అనుకోలేదని.. రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పురందేశ్వరి చొరవను చూశామని.. రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు ఆ చొరవ ఉపయోగపడింది అన్నారు చంద్రబాబు.
మరోవైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..చంద్రబాబుకు తనకూ వైరం ఉందని అంటుంటారని.. వైరం ఉన్నమాట నిజమే అన్నారు. ఇది వరకు చంద్రబాబు గురుంచి పుస్తకం రాసుండొచ్చు.. అదంతా గతం , అదంతా వదిలేస్తాం. నాకు ఎలాంటి భేషజాలు లేవు’ అన్నారు. చరిత్ర గతినే మార్చిన మహానుభావుల పాలనపై వివరాలను సేకరించి ప్రపంచ చరిత్రను రాశానన్నారు. కాలంతో పాటు మనం మారాలి నాకు మళ్లీ రాజకీయ కోరికలు లేవన్నారు. ఈ బుక్ కోసం ప్రపంచ నేతలు, తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేశానని చెప్పారు. తాను ఈ పుస్తకం రాసేందుకు ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందన్నారు.