ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) 75వ పుట్టినరోజు(75th birthday)ను ఘనంగా జరపడానికి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం(Kuppam)లో వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నాయి. తాజాగా కుప్పం మహిళలు తమ అభిమానాన్ని వినూత్నంగా తెలియజేశారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో పలువురు మహిళలు కలిసి తమ వేలిముద్రలతో చంద్రబాబు చిత్రాన్ని రూపొందించడం గమనార్హం. ఇది కేవలం శుభాకాంక్షలుగా కాదు, కుప్పం ప్రజల మనసులో ఆయనకు ఉన్న స్థానం ప్రతిబింబించేదిగా ఉంది.
Drugs Case : దసరా నటుడు అరెస్ట్ తో మరోసారి ఇండస్ట్రీ చిక్కుల్లో పడనుందా ..?
ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మహిళలు “చంద్రబాబు మా అరుదైన ఆస్తి” అని భావోద్వేగంగా పేర్కొన్నారు. పూరి ఆర్ట్స్ పురుషోత్తం నేతృత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గ్రామాల్లో ఊరేగించడం మహిళల సందేశాన్ని మరింత ప్రజల దృష్టికి తీసుకెళ్లింది. ఇది కేవలం వ్యక్తిగత అభిమానం కాదు, ఒక నాయకుడి పట్ల ప్రజల విశ్వాసాన్ని చూపించే ఉదాహరణగా నిలిచింది. చంద్రబాబు పుట్టినరోజు అంటే తమకు పండుగలాంటిదని వారు తెలిపారు.
దీనితో పాటు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు, మసీదుల్లో, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నాడు ఆత్మకూరులో హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు చంద్రబాబు తన కుటుంబంతో కలిసి ఐదు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. పుట్టినరోజు సందర్భంగా జరగబోయే ఈ ప్రత్యేక కార్యక్రమాలు ఆయన ప్రజాదరణకు నిదర్శనంగా నిలవనున్నాయి.